దేశ వ్యాప్తంగా సత్తా చాటి అక్కడ మాత్రం పరువు పోగొట్టుకున్న బీజేపీ  

Bjp Lose Parrikar Panaji Assembly Seat To Congress బి‌జే‌పి కాంగ్రెస్-bjp,congress,panaji,parrikar,కాంగ్రెస్,బి‌జే‌పి

2019 సార్వత్రిక పార్లమెంటు ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో బీజేపీ సంచలన ఫలితాలను సాధిస్తోంది. మ్యాజిక్‌ ఫిగర్‌ ఎన్డీయేకు సాద్యమే అంటూ అంతా భావించారు. కాని ఇంతటి సంచలన మెజార్టీ వస్తుందని మాత్రం ఎవరు ఊహించలేదు. మోడీ అండ్‌ కో ఏ స్థాయిలో బలంగా ఉన్నారో ప్రస్తుత ట్రెండ్స్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది..

దేశ వ్యాప్తంగా సత్తా చాటి అక్కడ మాత్రం పరువు పోగొట్టుకున్న బీజేపీ-BJP Lose Parrikar Panaji Assembly Seat To Congress బి‌జే‌పి కాంగ్రెస్

కాని పార్లమెంటు ఫలితాల వరకే ఈ ప్రభావం కనిపిస్తుంది. గోవాలోని మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి అయిన మనోహర్‌ పారికర్‌ స్థానంను మాత్రం బీజేపీ గెలువలేక పోయింది.

కొన్నాళ్ల క్రితమే మనోహర్‌ పారికర్‌ మృతి చెందిన విషయం తెల్సిందే.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం పనాజీలో సునాయాసంగా బీజేపీ కొట్టుకు రావాలి. కాని అక్కడ బీజేపీ సత్తా చాటలేక పోయింది. బీజేపీ అభ్యర్థిపైన కాంగ్రెస్‌ అభ్యర్థి దాదాపు రెండు వేల ఓట్ల తేడాతో గెలుపొందడం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

గోవాలో అధికారంలో ఉండటంతో పాటు, ముఖ్యమంత్రి స్థానంను బీజేపీ పోగొట్టుకోవడం పరువు పోగొట్టే విషయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రధాని అయినా ఇది మచ్చగానే ఉంటుందనే విమర్శ వ్యక్తం అవుతోంది.