ఓడిస్సాలో తెలుగు ఓటర్లని ఆకట్టుకోవడానికి బీజేపీ అభ్యర్ధి కొత్త ఎత్తులు

లోక సభ ఎన్నికలు హడావిడి దేశం అంతా ఇప్పుడు మంచి ఆసక్తికరంగా ఉంది.ఇక ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు ప్రజలని ఆకర్షించడానికి ఎలాంటి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారో సోషల్ మీడియాలో తెలిసిపోతూ ఉంటుంది.

 Bjp Lok Sabha Candidate Sing Telugu Songs For Attract To Telugu Voters-TeluguStop.com

ఒక్కో అభ్యర్ధి ప్రజలని ఆకట్టుకోవడానికి ఒక్కో పంథా ఎంచుకుంటాడు.ఇప్పుడు ఓడిస్సాలో పూరి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సంబిత్‌ పాత్రా అయితే ఓటర్స్ ని ఆకట్టుకోవడానికి ఏకంగా గాయకుడిగా మారిపోయారు.

పూరీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే పెంతకట ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం సంబిత్పాత్రా పర్యటించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో అతను తెలుగు పాటలు ఆలపించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.

కిల్లర్‌ సినిమాలోని తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో అంటూ పాడిన అతను, మగధీర సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటనూ పాడి అక్కడున్న యువతను ఉత్సాహ పరిచారు.వీటికి తెలుగు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లు తెల్సుతుంది.

ఇక ఇతను తెలుగు పాటలు పాడిన వీడియోను సంబిత్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube