సీఎం సీఎం అంటూనే పవన్ పరువు తీస్తున్న బీజేపీ ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు , అవమానాలకు గందరగోళానికి కారణం అవుతోంది.జాతీయ స్థాయి నాయకులు ఒక విధంగా , ఏపీ నాయకులు మరో విధంగా తెలంగాణ నాయకులు ఇంకో విధంగా ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతూ, సొంత పార్టీ నాయకులతో పాటు అందర్నీ గందరగోళానికి గురిచేస్తున్నారు.

 Tirupati Ls By-poll  Candidate Ratna Parabha Comments On Pawan Kalyan, Janasena,-TeluguStop.com

మరీ ముఖ్యంగా జనసేన నాయకులతో పాటు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసి అసలు పవన్ తో పొత్తు కోరుకుంటున్నారా అవమానించాలని చూస్తున్నారా అనే విషయం అర్థం కాకుండా వ్యవహరిస్తున్నారు.మొన్నటి వరకు ఏపీ బీజేపీ నాయకులు జనసేన ను పెద్దగా పట్టించుకోలేదు.

ఆ కోపంతోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో టిడిపికి పరోక్షంగా జనసేన కు మద్దతు పలికింది.బీజేపీ అభ్యర్థి పోటీ లో ఉన్న, పెద్దగా పట్టించుకోలేదు.
బీజేపీ ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తోంది.లోక్ సభ ఉప ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో, జనసేన అవసరం ఆ పార్టీకి బాగా వచ్చిపడింది.

తిరుపతి లో పవన్ సామాజికవర్గం ఎక్కువగా ఉండడం,  గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గెలుపొందడం ఇవన్నీ లెక్కలు వేసుకుని మరి ఇప్పుడు పవన్ ప్రాధాన్యం ఏపీ బిజెపి నాయకులు అమాంతంగా పెంచారు. బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ సీఎం అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

ఈ విషయంలో జనసేన సైతం ఆనందంగా ఉండగా,  తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రిటైర్డ్ ఐఏఎస్ రత్న ప్రభ పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు పవన్ సీఎం అభ్యర్థి కాదు అంటూ ఆమె ఓ టీవీ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న సందర్భంలో వ్యాఖ్యానించారు.

Telugu Ap Bjp, Janasena, Ratna Parabha, Somu Veerraju, Tirupathi, Tirupatils, Ys

 పవన్ సీఎం అభ్యర్థి అని సోము వీర్రాజు చెప్పిన విషయం తనకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు.దీంతో మరింత గందరగోళం ఏర్పడింది.ఇక తెలంగాణ బీజేపీ నాయకులు సైతం పవన్ ఎవరో తెలియనట్టు గా మాట్లాడుతూ ఉండడం వంటి వ్యవహారాలపై ఇప్పుడు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.బీజేపీ ఏపీ అధ్యక్షుడు పవన్ సీఎం అభ్యర్థి అంటూ పదేపదే ప్రస్తావిస్తున్న, మిగతా నాయకులు ఎవరు పట్టించుకోనట్లు వ్యవహరిస్తుండడంతో కేవలం తిరుపతిలో గట్టెక్కేందుకు మాత్రమే పవన ను ఉపయోగించుకుని, ఆ తరువాత పక్కన పెట్టేస్తారా అనే అనుమానం ఇప్పుడు జనసైనికుల్లో కలుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube