బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మాసాబ్ ట్యాన్క్ లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ… తెలంగాణ లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి గొర్రెల పంపిణీ అభివృద్ధి పథకం అమలు చేస్తున్నాం.3549.98 కోట్లు NCDC ద్వారా రుణం తీసుకోని పథకం అమలు చేస్తున్నాం.దీంట్లో కేంద్రం వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు.NCDCకి 2900.74 కోట్ల రూపాయలు రుణం తిరిగి చెల్లించాం.భారత ప్రభుత్వం అన్యాయం చేసింది అని మేము ఎక్కడ చెప్పలేము.

 Bjp Leaders Should Talk Responsibly  Minister Talasani Srinivas Yadav , Bjp Lead-TeluguStop.com

సకాలంలో రుణ చెల్లింపులు చేసినందుకు అభినందనలు తెలిపారు.

ఎంపీగా ఉన్న బండి సంజయ్ బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఆధారాలు లేకుండా జనం మధ్యన అబద్ధం చెప్పడం ఎంతవరకు కరెక్ట్.బీజేపీ బండి సంజయ్ ని ఎలా అధ్యక్షుడిగా పెట్టుకుంది ? మాట్లాడటానికి మాకు కూడా వస్తది.అబద్దాలు, అభూతకల్పనలు సృష్టించడం దుర్మార్గం.దమ్ముంటే గొర్రెలు పథకం దేశమంతా అమలు చేసి చూపండి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారు.రామప్ప దేవాలయానికి యూనిస్కో గుర్తింపులో మా పాత్ర లేదని ఎలా చెబుతారు.కేంద్రం తెలంగాణకు అవార్డ్స్ ఇస్తున్నారు నిధులు మాత్రం ఇయ్యడం లేదు.బీజేపీ నేతలు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోండి.

గొర్రెల పథకంపై బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube