జనసేనతో దోస్తీ.. టీడీపీతో కుస్తీ..?

ఏపీలో బీజేపీ రాజకీయం విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు.జనసేన పార్టీతో దోస్తీ కడతామని చెబుతూనే.

 Bjp Leaders On Alliance With Tdp Janasena,bjp,tdp,janasena,somu Veerraju,pawan K-TeluguStop.com

టీడీపీని మాత్రం పక్కన పెడతామని అంటున్నారు.కుటుంబ పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు తెగేసి చెబుతున్నారు.

అసలు ఇంతకీ టీడీపీకి బీజేపీకి ఎక్కడ చెడింది అనే వాదన మొదలు అయింది.పవన్ మాత్రం ఈ సారి వైసీపీని అధికారం నుంచి దూరం చేయడం ఖాయం అని చెబుతున్నారు.

వైసీపీ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వనని ప్రకటించారు.

Telugu Ap Janasena, Ap, Bjp, Chandrababu, Janasena, Pawan Kalyan, Somu Veerraju-

బీజేపీ నేతలు మాత్రం జనసేనతో మాత్రం అయితేనే ముందుకు వస్తామని.టీడీపీ అయితే పొత్తు వద్దని చెబుతున్నట్టు తెలుస్తుంది.సీట్ల పంపకం విషయంలో.

టీడీపీ అధినేత బీజేపీ అడిగినన్న ఇచ్చేందుకు వెనకాడుతున్నట్టు తెలుస్తోంది.జనసేన పార్టీకి ఇచ్చే సీట్ల కంటే చాలా తక్కువ సీట్లు ఇచ్చేందకు చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అసలే బీజేపీని టీడీపీ తమ్ముళ్లు ఎక్ట్సా లగేజీగానే భావిస్తున్నారు.ఇలాంటి టైంలో బీజేపీ నేతలు సపరేట్ గా పోటీ చేసినా పెద్దగా ప్రబావం చూపేది కూడా ఏదీ లేదని మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

Telugu Ap Janasena, Ap, Bjp, Chandrababu, Janasena, Pawan Kalyan, Somu Veerraju-

అందుకే కేవలం జనసేనతో మాత్రమే పొత్తుకు తమ్ముళ్లు ఒప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.జనసేనకు అయితే పదవులు త్యాగం చేస్తామని.బీజేపీ నేతలకు పదవులు త్యాగం చేయాల్సిన పని లేదని చంద్రబాబుకు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది.అందుకే ముందుగానే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ఇక పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసీ.బీజేపీని తప్పకుండా కలుపుకోవాలని అడిగితే తప్పా.

బీజేపీతో పొత్తు కుదిరేలా కనిపించడం లేదు.మరి ఇప్పటికైనా బాబు ఒక మెట్టు దిగి వస్తారా లేదా అనేది చూడాలి.

ఒక వేళ జనసేన కూడా బీజేపీకి హ్యాండ్ ఇస్తే.ఏపీలో బీజేపీ సింగిల్ గానే బరిలో నిలబడే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube