బీజేపీనుంచి కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు.. రేవంత్ ఎఫెక్ట్‌తో మ‌రో కీల‌క‌నేత హ‌స్తం గూటికి..?

మొద‌ట్లో టీఆర్ ఎస్‌లోకి అన్ని పార్టీల నుంచి వ‌ల‌స‌లు కొన‌సాగాయి.కానీ ఆ త‌ర్వాత అనూహ్యంగా బీజేపీ పుంజుకోవ‌డంతో ఆ పార్టీలోకి వ‌ల‌సలు సాగాయి.

 Bjp Leaders Migrates To Congress Another Key Leader Into Congress With Revanth Effect-TeluguStop.com

మొన్న‌టి వ‌ర‌కు ఇదే తంతు కొన‌సాగింది.కాంగ్రెస్‌లోని అసంతృప్తులు అంద‌రూ కూడా టీఆర్ ఎస్‌లోకి లేదా బీజేపీలోకి వ‌ల‌స‌లుగా వెళ్లారు.

అంతేగానీ కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన వారెవ‌రూ లేరు.దీంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం నిర్వీర్యం అయిపోయింద‌నే చెప్పాలి.

 Bjp Leaders Migrates To Congress Another Key Leader Into Congress With Revanth Effect-బీజేపీనుంచి కాంగ్రెస్ లోకి వ‌ల‌స‌లు.. రేవంత్ ఎఫెక్ట్‌తో మ‌రో కీల‌క‌నేత హ‌స్తం గూటికి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇప్పుడు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని పార్టీ చీఫ్ గా ప్ర‌క‌టించ‌డంతో సీన్ రివ‌ర్స్ అవుతోంది.టీఆర్ ఎస్‌, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌ల‌స‌లు మొద‌ల‌వుతున్నాయి.

ఇక మొన్న‌టి వ‌ర‌కు ఈ ఎఫెక్ట్ టీఆర్ ఎస్‌పైనే ఉండ‌గా ఇప్పుడు మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన వారంతా మ‌ళ్లీ రేవంత్ ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ బాట ప‌డుతున్నారు.ఆయ‌న కూడా వారి ఇండ్ల‌కు వెళ్లి మ‌రీ ఆహ్వానిస్తుండ‌టంతో వారంతా మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి వ‌చ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

దీంతో బీజేపీ పెద్ద‌లు ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకుని మ‌రీ వారెవ‌రూ పార్టీని వీడ‌కుండా చూసేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు.అయితే వారెంత ప్ర‌య‌త్నించినా కూడా రేవంత్ ఎఫెక్ట్‌తో బీజేపీలోని టీడీపీ, కాంగ్రెస్ లీడ‌ర్లు మొత్తం రేవంత్ కే జై కొడుతున్నారు.

Telugu Bjp, Joining Cjongress, Koona Srisailam Goud, Revant, Revanth Reddy, Telangana Congress, Tpcc Chief, Ts Politics-Telugu Political News

దీంతో మ‌ళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటోంది.ఇక ఇప్పుడు మ‌రో కీల‌క నేత బీజేపీని వీడేందుకు రెడీ అవుతున్నారు.ఆయ‌న కూన శ్రీశైళం గౌడ్‌.గతంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్యేగా ఉన్న ఈయ‌న ఆ త‌ర్వాత ఓడిపోవ‌డంతో బీజేపీలోకి వెళ్లారు.అయితే మొద‌టి నుంచి రేవంత్‌తో మంచి సంబంధాలు ఉన్న శ్రీశైలం గౌడ్ ఇటీవ‌లే రేవంత్‌తో స‌మావేశం అయిన‌ట్టు తెలుస్తోంది.ఇక రేవంత్ కూడా మ‌ల్లీ క‌లిసి ప‌నిచేసేందుకు ఆహ్వానించ‌డంతో ఆయ‌న కూడా వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు.

మ‌రి రేవంత్ ప్లాన్‌ను బీజేపీ అడ్డుకుంటుందా లేదా అనేది చూడాలి.

#KoonaSrisailam #Ts Politics #Revanth Reddy #Revant #TPCC Chief

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు