జగన్ కు కేంద్రం అలా చెప్పిందా ? వీరి పదవులు పోవడంలేదా ?  

bjp leaders instruction to ys jagan about ap legislative council tdp mlc -

ఏపీ ప్రభుత్వానికి కి కేంద్ర అధికార పార్టీ బిజెపి చిన్న ఝలక్ ఇచ్చింది.ఏపీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, ఏపీ అధికార పార్టీ వైసిపి తీసుకునే ప్రతి నిర్ణయం శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటూ వస్తోంది.

TeluguStop.com - Bjp Leaders Instruction To Ys Jagan About Ap Legislative Council Tdp Mlc

<a href=https://telugustop.com/bjp-leaders-instruction-to-ys-jagan-about-ap-legislative-council-tdp-mlc/ style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com </a>.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానులు, సిఆర్డిఏ రద్దు తదితర విషయాల్లో వైసిపి నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో అడ్డుకుంటున్నారు.ఈ వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి చికాకు కలిగిస్తోంది.

TeluguStop.com - జగన్ కు కేంద్రం అలా చెప్పిందా వీరి పదవులు పోవడంలేదా -Political-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలోనే శాసనమండలి రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయించిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం శాసన మండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిధిలో ఉంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

......

శాసనమండలిని రద్దు చేస్తుంది అని వైసిపి చాలానే ఆశలు పెట్టుకుంది.ఇప్పుడు కేంద్రం ఏపీ శాసనమండలిని రద్దు చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

.TeluguStop

ఈ మేరకు జగన్ కు కేంద్ర బీజేపీ పెద్దల నుంచి సమాచారం అందడమే కాకుండా ఓ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.శాసనమండలిని రద్దు చేసే అవకాశం ఇప్పట్లో లేదని, కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను మీ దారిలోకి తెచ్చుకోవాలంటూ సూచించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు జగన్ కూడా కేంద్రం శాసనమండలిని రద్దు అయ్యే అవకాశం లేదు అనే విషయం జగన్ కు కూడా క్లారిటీ వచ్చినట్టు సమాచారం.అందుకే టిడిపి ఎమ్మెల్సీలను తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ శాసనమండలి లో ప్రస్తుతం 58 మంది సభ్యులు ఉన్నారు.వీరిలో 26 మంది టీడీపీ ఎమ్మెల్సీలు.

వీరిలో ఇప్పటికే ముగ్గురు వైసీపీ గూటికి చేరారు.శాసనమండలి రద్దు చేస్తున్నట్లు జగన్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్సీలు వైసీపీ లోకి వచ్చి చేరారు.

తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ యామిని బాల తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.మరో రెండు సంవత్సరాల్లో ఏపీ శాసనమండలి లో వైసీపీ బలం మరింతగా పెరుగుతుంది దీంతో ఇంత హడావిడిగా శాసనమండలిని రద్దు చేసే కంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలను మీ దారిలోకి తెచ్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే విషయాన్ని కేంద్ర పెద్దలు జగన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఎమ్మెల్సీలను తమ దారిలోకి తెచ్చుకునే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ జగన్ మొదలుపెట్టారు.టిడిపి నుంచి వైసిపి లోకి వస్తే ఎటువంటి అవకాశాలు ఇస్తామని విషయాన్ని ముందుగానే చెబుతూ వారిని పార్టీలోకి వచ్చే విధంగా జగన్ పావులు కదుపుతున్నారు.శాసన మండలి రద్దు అవుతుందనే ధీమా తోనే ఎమ్మెల్సీ లు, మంత్రులు అయిన మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ లను జగన్ రాజ్యసభకు పంపించారు.

ప్రస్తుతం శాసనమండలి రద్దు అయ్యే అవకాశం లేకపోవడంతో ఎమ్యెల్సీలంతా రిలాక్స్ అవుతున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Leaders Instruction To Ys Jagan About Ap Legislative Council Tdp Mlc Related Telugu News,Photos/Pics,Images..