వరుస ఘటనలతో బీజేపీకి చిక్కులు... కేసీఆర్ ట్రాప్ లో పడ్డారా

తెలంగాణలో బీజేపీ తాము అనుకున్న వ్యూహం ప్రకారం వెళ్తూ టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది.అయితే ఇప్పటి వరకు తెలంగాణ లేని తరహా రాజకీయాన్ని బీజేపీ పరిచయం చేస్తోందని చెప్పవచ్చు.

 Bjp Leaders Falls Under Kcr Political Strategy, Bjp Bandi Sanjay, Cm Kcr, Telang-TeluguStop.com

అయితే ఇటీవల వరి ధాన్యం కొనుగోలుపై చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నల్గొండ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు ఇలాంటి ఘటనలతో ఆ నాలుగు రోజులు బీజేపీకి భారీగా లబ్ధి జరిగినా తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందనేది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం.అయితే ఇలా కెసీఆర్ మౌనాన్ని ఆధారంగా చేసుకొని బీజేపీ తొందర పాటు నిర్ణయాలతో ముందుకెళ్తే ఇక బీజేపీ చేసే అతి పెద్ద తప్పు ఇదే అని మనం భావించవచ్చు.

ఎందుకంటే  కెసీఆర్ ఎంతటి రాజకీయ వ్యూహకర్త అనేది మనం కొత్తగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.

Telugu Bandi Sanjay, Cm Kcr, Cm Kcr Strategy, Telangana-Political

అయితే బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ వ్యూహాల్ని కెసీఆర్ పసిగట్టకుండా ఉంటాడా అంటే ఖచ్చితంగా పసిగట్టే ఉంటాడు.కాని స్పందించలేదంటే ప్రధాన కారణం సరైన సమయంలో సరైన వ్యూహాన్ని ప్రయోగించడమే కెసీఆర్ మార్క్ రాజకీయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఇప్పటివరకు కెసీఆర్ స్పందించలేక పోవడంతో బీజేపీ చేస్తున్న తప్పులతో బీజేపీ కెసీఆర్ ట్రాప్ లో పడిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా బీజేపీకి స్వేచ్చ ఇచ్చి ఇంకాస్త తప్పులు బీజేపీ చేసేలా వాతావరణాన్ని సృష్టించి సరైన సమయంలో కెసీఆర్ బీజేపఎ చాప్టర్ క్లోజ్ చేసే అవకాశం ఉంది.అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ దూకుడే టీఆర్ఎస్ కు లాభించే పరిణామమని అందుకే టీఆర్ఎస్ నేతలు చాలా ఆచితూచి బీజేపీని ఇరుకున పెట్టే విధంగానే టీఆర్ఎస్ నాయకుల విలేఖరుల సమావేశాలు ఉండడానికి ఇదే ప్రధాన కారణమనే భావన వ్యక్తమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube