రాజధానిపై బీజేపీ వాయిస్... వైసీపీ ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది

ఏపీలో మూడు రాజధానుల రచ్చ ఇప్పుడు తారాస్థాయికి చేరుతుంది.ప్రధానంగా అధికార పార్టీ తన నిర్ణయాన్ని సమర్ధించుకొని ఎలా అయిన మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని గట్టిగా అనుకుంటూ ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ అమరావతిలో రాజధాని ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని గట్టిగా అనుకుంటూ అడ్డు పడుతున్నాయి.

 Bjp Leaders Counter Attack On Ycp On Three Capitals-TeluguStop.com

అయితే విపక్షాలు ఎవరికీ వారు తమ పోరాటాలని వేర్వేరుగా చేస్తున్నారు.ఇక మూడు రాజధానుల విషయాన్ని కేంద్రంతో చెప్పి చేస్తున్నామని, కేంద్రం కూడా తమ నిర్ణయానికి మద్దతు ఇచ్చిందని అబద్ధపు వార్తని ప్రచారం చేసుకున్నారు.

అయితే దీనిని బీజేపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.అసలు మూడు రాజధానుల విషయాన్ని వైసీపీ ప్రభుత్వం కేంద్రం అనుమతి తీసుకోలేదని తేల్చి చెప్పేసింది.

వైసీపీ తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఉందని ఎమ్మెల్సీ జీవీఎల్ స్పష్టం చేసేశారు.మరో వైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇక జనసేన పార్టీ కూడా రాజధానిని అమరావతిలో ఉంచాలని చెబుతుంది.వైసీపీ మూడు రాజధానుల నిర్ణయం తాత్కాలికమే అని పవన్ కళ్యాణ్ నొక్కి చెబుతున్నారు.

త్వరలో దీనిపై కేంద్రం సరైన పాతా`పంథాలో స్పందించడంతో పాటు వైసీపీకి బుద్ధి చెబుతుందని అంటున్నారు.దానికి తగ్గట్లే బీజేపీ పార్టీ కూడా మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు స్థానిక బీజేపీ నేతలతో ఈ వ్యవహారంలో బీజేపీ, జనసేన పార్టీలు అటు అధికార పార్టీని, ఇటు ప్రతిపక్ష పార్టీని తప్పు పడుతున్నారు.

తాజాగా జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో నిజంగా ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే రేపటి లోగా వారిపై క్రిమినల్ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, అలా కాకుండా వట్టి ఆరోపణలతో సరిపెడితే బీజేపీ పార్టీ తరుపున తామెంటో చూపిస్తామని చెబుతున్నారు.ఏది ఏమైనా ఇప్పుడు కేంద్రంతో కూడా వైసీపీ మూడు రాజధానుల అంశానికి వ్యతిరేకత వచ్చేలానే కనిపిస్తుంది.

మరి దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube