బీజేపీ పై మరో పంచ్ వేసిన సిద్దూ....మరోసారి నోటీసులు పంపిన ఈసీ  

Bjp Leaders Are Black Britishers Siddu Comments-

కాంగ్రెస్ నేత,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ భారతీయ జనతా పార్టీ పై మరో పంచ్ విసిరారు. వారంతా నల్ల బ్రిటీషర్లు అని అంటూ సిద్దూ అభివర్ణించారు. శుక్రవారం మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కి మద్దతుగా ప్రచార ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీ లో పాల్గొన్న సిద్దూ ప్రసంగిస్తూ మోడీ సహా బీజేపీ నేతలు అందరూ నల్ల బ్రిటీషర్లు అని వ్యాఖ్యానించారు..

బీజేపీ పై మరో పంచ్ వేసిన సిద్దూ....మరోసారి నోటీసులు పంపిన ఈసీ -BJP Leaders Are Black Britishers Siddu Comments

అలానే ఈ సందర్భంగా మోడీ పై విమర్సలు గుప్పించారు కూడా. మోడీ అంబానీ,ఆదానీ లకు మాత్రమే చౌకీ దార్(కాపలాదారుడు)అని ఎద్దేవా చేసారు. అలానే ఈ కాంగ్రెస్ పార్టీ మహాత్మగాంధీది.

మౌలానా అజాద్ది. కాంగ్రెస్. వలసవాదుల స్వామ్యం నుంచి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ. ఇప్పుడు మీ ఇండోర్ ప్రజలంతా కలిసి నల్ల ఆంగ్లేయులు, చౌకీ దార్ల నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలి. మీ ఓట్లను తక్కువగా ఊహించుకోకండి అని అంటూ సిద్ధూ వ్యాఖ్యానించారు.

మరోపక్క సిద్దూ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు అందడం తో తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సిద్దూ కు నోటీసులు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఈ విధంగా సిద్దూ కి నోటీసులు పంపడం ఇది రెండోసారి. అయినా వివాదాలకు సిద్దూ కొత్తేమి కాదు.

గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.