జగన్ పై ఆ బీజేపీ నేతలకు అంత గుర్రు ఎందుకు ?

వైసీపీ అధినేత జగన్ విషయంలో బీజేపీ చేస్తున్న రాజకీయం వైసీపీ నేతలకు మింగుడుపడడంలేదు.తమ పార్టీతో మొన్నటి వరకు సఖ్యతగా ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండడం, తమ అధినేత జగన్ ను అన్నిరకాలుగా ఇరికించే విధంగా వ్యవహరించడానికి కారణాలు ఏంటి అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

 Bjp Leaders Angry On Jagan Mohan Reddy-TeluguStop.com

అదే సమయంలో బీజేపీ కి బద్ద శత్రువులుగా ఉన్న టీడీపీ తో సఖ్యతగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుండడం, జనసేన పార్టీతో పొత్తు కానీ, విలీనం కానీ చేసే ఆలోచనలో ఉండడం వైసీపీకి ఆందోళన కలిగిస్తోంది.అదీ కాకుండా విజయవాడలో సీబీఐ కోర్టు పెట్టాలంటూ ఉదయం రవిశంకర్ ప్రసాద్‌కు వినతి పత్రం ఇచ్చారు కొంతమంది బీజేపీ నాయకులు.

అదే రోజు సాయంత్రం మరో బ్యాచ్‌గా అమిత్ షాను కలిశారు.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులను వైసీపీ టార్గెట్ చేసుకుంటోందని, తమ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఫిర్యాదు చేశారు.

Telugu Apbjp, Apcm, Bjpangry, Jagan, Jagan Bjp-

అయితే.రవిశంకర్ ప్రసాద్ ను కలిసిన బృందానికి అమిత్ షా కలిసిన బృందానికి తేడా ఉంది.రెండూ వేర్వేరు బృందాలు.రెండింటిలోనూ విష్ణువర్ధన్ రెడ్డి లేరు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గంగా ప్రచారం పొందిన బీజేపీ నాయకులు మాత్రం జగన్ పై ఫిర్యాదులకు దూరంగా ఉంటున్నారు.కానీ నిజమైన బీజేపీ భక్తులు మాత్రం జగన్ ను అన్నిరకాలుగా టార్గెట్ చేసుకున్నారు.

ప్రస్తుతం బీజేపీలో చేరికలు ఏపీ నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి.అయితే ఇప్పుడు బీజేపీ వైసీపీ చూస్తున్న వారంతా కేసుల భయంతోనే బీజేపీలో చేరుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే జగన్ మాత్రం బీజేపీలో చేరినా నేను వదిలిపెట్టను అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల బీజేపీలో చేరిన జమ్మలమడుగు నాయకుడు ఆదినారాయణరెడ్డికి, వైఎస్ వివేకా హత్య కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు.

అలాగే, జిల్లాల్లోనూ బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు.దీన్ని బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు.ఇక ముందు ముందు తమ పార్టీ నేతలే వైసీపీ టార్గెట్ అని బీజేపీకి అర్ధం అయిపొయింది అందుకే జగన్ ను జాతీయ స్థాయిలో ఇరికించి తమ పార్టీ హవా పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నింస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube