కే‌సి‌ఆర్ చెప్తేనే బండి సంజయ్ పై దాడి  

నేడు జి‌హెచ్‌ఎం‌సి పరిదిలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఆయా పార్టీలకు చెందిన నాయకుల ప్రచారంతో హైదరాబాద్ వేడెక్కింది.

TeluguStop.com - Bjp Leader Vivek Comments On Kcr

హైదరాబాద్ ప్రజలు ఎవరికి మేయర్ సీట్ ను కట్టబెట్టుతారో మరి కొద్ది రోజుల్లోనే తెలియనున్నది.ఈ నేపథ్యంలోనే తెలంగాణా బి‌జే‌పి పార్టీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ పై గత రాత్రి టి‌ఆర్‌ఎస్ పార్టీ నేతలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటనపై బి‌జే‌పి నేత జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల నిర్వహణ కమిటీ జాయింట్ కన్వీనర్ వివేక్ మాట్లాడుతూ.తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదని కుటుంబ పాలన నడుస్తుందని తెలంగాణా సి‌ఎం కే‌సి‌ఆర్ ఆయన కొడుకు కే‌టి‌ఆర్ పై మండి పడ్డాడు.

TeluguStop.com - కే‌సి‌ఆర్ చెప్తేనే బండి సంజయ్ పై దాడి-Political-Telugu Tollywood Photo Image

దుబ్బాక ఉప ఎన్నికల్లో బి‌జే‌పి గెలవడాన్ని కే‌సి‌ఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు.

హైదరాబాద్ లో ఎక్కడ బి‌జే‌పి గెలుస్తుందో అని తండ్రికొడుకులకు భయం పట్టుకుంది.తెరాస పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు.ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు.

అందుకే దుబ్బాక ను మాకు కట్టబెట్టారు.బండి సంజయ్ పై జరిగిన దాడి ముమ్మాటికి కే‌సి‌ఆర్ ఆదేశాల మేరకే జరిగిందని ఆరోపించాడు.

తక్షణమే దాడికి కారణం అయిన వారిని అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశాడు.తెలంగాణలో టి‌ఆర్‌ఎస్ ది రాక్షస పాలన అందుకే డబ్బులు వెదజల్లి ఓట్లు తెచ్చుకోవాలని చూస్తున్నారు.

ఈసారి జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బి‌జే‌పి గెలుస్తుందని వివేక్ అన్నారు.

#GHMC Elections #Vivek #Bandi Sanjay #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Leader Vivek Comments On Kcr Related Telugu News,Photos/Pics,Images..