సుశాంత్ సింగ్‎ది ముమ్మాటికి హత్యే -బీజేపీ నేత  

bjp leader subramanya swamy, actor sushanth singh rajputh, murder, mumbai, bihar police - Telugu Actor Sushanth Singh Rajputh, Bihar Police, Bjp Leader Subramanya Swamy, Mumbai, Murder

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‎పుత్‎ది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్యే అని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి వెల్లడించారు.సుశాంత్‎ది హత్యేనని భావించేందుకు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియా ద్వారా ఆధారాలను వెల్లడించారు.

 Bjp Leader Subramanya Swamy Actor Sushanth Singh Rajputh

బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ సాధ్యం కాదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అయితే అనిల్ దేశ్ ముఖ్ చెప్పిన గంటల వ్యవధిలోనే హత్యేనని సాక్ష్యాధారాలు అంటూ సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

సుశాంత్ సింగ్ రాజ్‎పుత్‎ది ఆత్మహత్యగా చిత్రికరించేందు ముంబయి మూవీ మాఫియా పనిచేస్తోందని సుబ్రమణ్య స్వామి ట్వీట్టర్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఓ నటిని బలి చేసేందుకు రంగం సిద్ధమైందని అన్నారు.

సుశాంత్ సింగ్‎ది ముమ్మాటికి హత్యే -బీజేపీ నేత-Latest News-Telugu Tollywood Photo Image

సుశాంత్ గొంతు మీద ఉరి వేసుకోవడం వల్ల కల్గిన గాయం, ఆ వస్త్రంతో కలిగిన గాయంతో మ్యాచ్ అవకపోవడం, రూమ్ డూప్లికేట్ కీ మిస్ అవ్వడం, ఇంట్లో పనిచేసేవారు చెబుతున్న సమాధానాలు పొంతన లేకపోవడం, సిమ్ కార్డులను మార్చడం, ఆర్ధికంగా ఇబ్బందులు లేకపోవడం ఇవన్నీ సుశాంత్ ది హత్యే నని నిరూపిస్తున్నాయని సుబ్రమణ్య స్వామి అన్నారు.

సుశాంత్ సింగ్ బాంద్రాలోని తన నివాసంలో జూన్ 14న మృతి చెందిన సంగతి తెలిసిందే.

సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా బిహార్ సీఎం నితీష్ కుమార్ ను సుబ్రమణ్య స్వామి బుధవారం కోరారు.గతంలో ప్రధాని మోదీకి లేఖ రాసిన లేఖలో ఈ కేసును సీబీఐకు అప్పగించమని కోరారు.

బాలీవుడ్ లోని ప్రముఖులు ఈ కేసును మూసివేయాలని ముంబయి పోలీసులపై, మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు.

#Murder #Bihar Police #Mumbai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Leader Subramanya Swamy Actor Sushanth Singh Rajputh Related Telugu News,Photos/Pics,Images..