ఎన్నికల వేళ బీజేపీ నేతకు షాకిచ్చిన ఈసీ.. ఆయన ప్రచారం నిషేధం.. ?

ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కొందరి నేతలకు సహజం అయ్యింది.కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యల పట్ల ఎన్నికల కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 Bjp Leader Shocked By Election . His Campaign Ban  Bjp Leader, Himanta Bishwa Sh-TeluguStop.com

తాజాగా ఇలాంటి సందర్భాన్నే బీజేపీ కీలక నేత హిమాంత బిష్వ శర్మ ఎదుర్కొన్నారు.

ఆ వివరాలు చూస్తే బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్)చీఫ్‌ హగ్రామా మోహిలరీని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ద్వారా అక్రమంగా జైలుకు పంపిస్తానని బీజేపీ నేత శర్మ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ బీపీఎఫ్ మిత్ర పక్షం కాంగ్రెస్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ శర్మపై నిషేధం విధించింది.రెండు రోజుల పాటు పార్టీ ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల వేళ అసోంలో ఇలా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందని ఊహించని నేతలు ఒక్క సారిగా షాక్ అయ్యారట.అయితే తనపై ఎన్నికల సంఘం విధించిన నిషేదంపై బీజేపీ నేత హిమాంత బిశ్వర్మ గువహతి హైకోర్టును ఆశ్రయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube