మమత పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి !  

BJP leader says will hug Mamata Banerjee if infected with Covid, complaint filed, BJP leader, Mamata Banerjee, BJP national secretary Anupam Hazra,Covid-19,Trinamool Congress - Telugu Bjp Leader, Bjp Leader Says Will Hug Mamata Banerjee If Infected With Covid, Bjp National Secretary Anupam Hazra, Complaint Filed, Covid-19, Mamata Banerjee, Trinamool Congress

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల బీజేపీ అధిష్టానం కార్యవర్గంలో చేసిన మార్పుల్లో భాగంగా అనుపమ్ ను నూతన జాతీయ కార్యదర్శి గా నియమించారు.

TeluguStop.com - Bjp Leader Says Will Hug Mamata Banerjee If Infected With Covid

అయితే ఆ జోష్ లో ఉన్న అనుపమ్ అధికార పార్టీ పై విమర్శలు చేస్తూ ఆ క్రమంలో సీఎం మమతా బెనర్జీ పై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు.తనకు కరోనా వైరస్ సోకితే బెంగాల్ ముఖ్యమంత్రి మమత ను కౌగలించుకుంటాను అంటూ ఒక చెత్త కామెంట్ చేశాడు.

అయితే ఒక సీఎం పై అందులోనూ ఒక మహిళా నేత పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం తో అతడిపై డార్జిలింగ్ జిల్లా లోని సిలిగురి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది.దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

TeluguStop.com - మమత పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అధికార పార్టీ పై బీజేపీ ఆరోపణలు చేస్తుంది.కోవిడ్ కేసుల విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంది అంటూ బీజేపీ ఆరోపిస్తుంది.

ఈ క్రమంలోనే అనుపమ్ మాట్లాడుతూ… నాకు కూడా ఎదో ఒక టైమ్ లో కరోనా సోకుతుంది.అప్పుడు నేను నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని కౌగలించుకుంటాను అని అప్పుడు కానీ ఆమెకు ప్రజలు పడుతున్న కష్టమేంటో అర్ధం కాదు, ప్రియమైనవారిని కోల్పోయినవారి ఆవేదన ఏంటో అప్పుడు ఆమెకు తెలుస్తుంది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అయితే నూతన జాతీయ అధ్యక్షుడు అన్న కారణమో ఏమో గానీ ఆయన గారు ఇంత డర్జీ కామెంట్‌ చేసినప్పటికీ బెంగాల్‌లోని బీజేపీ నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.అయితే బీజేపీకి కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్‌ మాత్రం….

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ అనుపమ్‌ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

#Complaint Filed #COVID-19 #BJPLeader #Mamata Banerjee #BJPNational

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Leader Says Will Hug Mamata Banerjee If Infected With Covid Related Telugu News,Photos/Pics,Images..