విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం.బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ మీడియా పాయింట్స్.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జిపియస్ ఖాతాల నుంచి డబ్బులు దొంగిలించింది.పొరబాటున జరిగితే ఒకేసారి 80వేల ఖాతాల నుంచి ఎలా డ్రా అవుతాయి.
గత నవంబర్ లో కూడా ఇదే విధంగా డబ్బులు మాయమాయ్యాయి.జమ చేసిన డబ్బును మళ్లీ విత్ డ్రా చేయడం అంటే ఉద్యోగులను మోసం చేయడమే.
డే లైట్ రోబరీకి ప్రభుత్వం పాల్పడిందని తీవ్రమైన ఆరోపణ.చర్యలు తీసుకోవాల్సిన వారే.
చోరీకి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలి.పిఆర్సీ, హెచ్.
ఆర్.ఎ, అలెవెన్స్ ల విషయంలో కూడా మోసం చేసింది.ఆర్ధిక శాఖ మంత్రి కూడా దీని పై స్పందించాలి.Cfms ద్వారా తప్పు జరిగిందని చెప్పడాన్ని ఖండిస్తున్నాం.ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడిందని అందరకీ అర్థం అయ్యింది.పంచాయతీలకు చెందిన నిధులు ఇప్పటికే దారి మళ్లించారు.
ఇప్పుడు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల నుండి ఉద్దేశపూర్వకంగా డ్రా చేశారు.రాష్ట్రానికి అప్పు పుట్టడానికి.
ప్రభుత్వమే అడ్డ దారుల్లో వెళుతుంది.ప్రభుత్వ చర్యలు తప్పు అని చెబితే… ఉద్యోగులను గతంలో సస్పెండ్ చేశారు.
ప్రభుత్వం ఆర్ధిక క్రమ శిక్షణ, అనవసర ఖర్చులు పై దృష్టి పెట్టాలి.ప్రభుత్వం బుక్ ఎడ్జెస్ట్ మెంట్ కోసం చేసినా నేరమే అవుతుంది.
ఉద్యోగుల పోరాటాలకి బిజెపి అండగా ఉంటుంది.జులై 4వ తేదీన ప్రధానమంత్రి మోడీ భీమవరం వస్తున్నారు.దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల జీవితాలను ప్రజలకు వివరిస్తాం.అల్లూరి సీతారామరాజు తరహాలో ఎంతో మంది త్యాగాలు ను మోడీ వివరిస్తున్నారు.
మోడీ భీమవరం సభలో అల్లూరి సీతారామరాజు త్యాగాలు దేశ వ్యాప్తంగా చాటి చెబుతారు.అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను స్పూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం.
లంబసింగ్ లో 35 కోట్లు తో అల్లూరి జీవిత విశేషాలతో కూడిన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం.భారత ప్రధాని మన్ కీ బాత్ లో అల్లూరి ప్రస్ధావన తీసుకుని వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
జులై 2,3.తేదీలలో హైదరాబాదు లో బిజెపి కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి.దేశంలో బిజెపి బలమైన శక్తి గా ఎదిగేలా కార్యాచరణ ఉంటుంది.ఎపి లో కూడా బిజెపి బలోపేతం అయ్యే దిశగా కార్యక్రమాలు ఉంటాయి.మోడీ రాక సందర్భంగా నల్ల జెండాలు ఎందుకు ఎగుర వేయాలి.వైసిపి ఎమ్మెల్సీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా…వైసిపి అధిష్టానం నిర్ణయమా.
ఈతరహా వ్యాఖ్యలను ప్రజలు అసహ్యించుకుంటారు గతంలో తెలుగుదేశం ఇదేవిధంగా వ్యవహరిస్తే ప్రజలు అసహ్యించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.ఇటువంటి ఎమ్మెల్సీ లను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణలో టి.ఆర్.యస్, ఎపి లో వైసిపి ప్రభుత్వ విధానాల పై మా పోరాటం కొనసాగుతుంది.ధర్మవరం సంఘటన పై డిజపి ఫిర్యాదు చేశాం.
యాభై మంది వరకు బిజెపి కార్యకర్తలు దాడికి గురయ్యారు.ధర్మవరం విషయం చాలా సీరియస్ గా పరిగణిస్తున్నాం.
దీని పై కేంద్ర హోం మంత్రి కి కూడా లేఖ రాస్తాం.ఇటువంటి దౌర్జన్యాలు పై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి.
పాత్రికేయుల సమావేశంలో బిజెపి సీనియర్ నేత వామరాజు సత్యమూర్తి, అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు.







