బీజేపీకి కోవర్ట్ ల భయం పట్టుకుందా ?

తెలంగాణలో వచ్చే ఎన్నికలతో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ ఆ దిశగా గట్టి ప్రయత్నలే చేస్తోంది.విజయం కోసం పక్కా ప్రణాళికలతో వ్యూహరచన చేస్తున్నారు కమలనాథులు కమలనాథులు.

 Bjp Leader  Nandishwar Reddy Comments On Cm Kcr ,  Etela Rajendra , Bjp, Cm Kcr-TeluguStop.com

కే‌సి‌ఆర్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతనే ఆయుధంగా ఉపయోగించి ప్రజా ఓటు బ్యాంకు కొల్లగొట్టాలనేది కాషాయ పార్టీ అంతిమ టార్గెట్.అందుకే కే‌సి‌ఆర్ ను దెబ్బ తీసే ఈ చిన్న అవకాశాని కూడా వదలడం లేదు, ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం, డిల్లీ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన మోసాలు.

ఇలా కే‌సి‌ఆర్ పై ప్రయోగించేందుకు అస్త్రశాస్త్రాలనే సిద్దం చేసుకుంది బీజేపీ అధిష్టానం.

Telugu Cm Kcr, Congress, Etela Rajendra, Telangana, Ts-Politics

అయితే బీజేపీ( BJP ) ఎన్ని రకాల విమర్శలు చేస్తున్న అనుకున్న స్థాయిలో కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టకపోగా.ఇంకా బీజేపీ పైనే నెగిటివ్ ఇంపాక్ట్ పడుతోంది.దీనికి ఉదాహరణగా ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారాన్ని చెప్పుకొచ్చు.

ఈ వ్యవహారంలో కే‌సి‌ఆర్ పై బురద చల్లే ప్రయత్నం చేసిన.వికటించి బండి సంజయ్ అరెస్ట్ కావల్సిన పరిస్థితి.

మరి ఈ రకంగా కే‌సి‌ఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవన్నీ బెడిసి కొడుతూనే ఉన్నాయి.దీనికి కారణం బీజేపీలో కే‌సి‌ఆర్ కోవర్ట్ లు ఉండడమే అని కమలనాథులే ఒప్పుకుంటున్నారు.

ఆ మద్య బీజేపీ నేత ఈటెల రాజేంద్ర( Etela Rajendra ) మాట్లాడుతూ బీజేపీలో సి‌ఎం కోవర్టులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

Telugu Cm Kcr, Congress, Etela Rajendra, Telangana, Ts-Politics

అయితే ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించినప్పటికి.మళ్ళీ తాజాగా బీజేపీ కీలక నేత నందీశ్వర్ రెడ్డి( Nandishwar reddy ) కూడా ఇదే విధంగా వ్యాఖ్యానిచడం చర్చనీయాంశం అయింది.బీజేపీలో కే‌సి‌ఆర్ ( CM KCR )కోవర్ట్ లు ఉన్న మాట వాస్తవమేనని, వారి పేర్లతో సహ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఒక్కసారిగా బాంబు పేల్చారు నందీశ్వర్ రెడ్డి.

దీంతో ఎవరా కోవర్ట్ లు అనే చర్చ ఊపందుకుంది.కోవర్ట్ ల కారణంగా బీజేపీ ఎలాంటి వ్యూహరచన చేసిన వాటిని కే‌సి‌ఆర్ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారనేది కొందరు చెబుతున్నా మాట.అయితే కాషాయ పెద్దలు ఈ కోవర్ట్ లపై సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది.మరి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉన్న బీజేపీ అధిష్టానం కోవర్ట్ ల విషయంలో ఎలా రియాక్క్త్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube