ఎంపీ సీఎం రమేశ్ కు కరోనా నిర్ధారణ

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కు కూడా కారోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా బారిన పడుతున్నారు.

 Bjp Leader Cm Ramesh Tested Positive, Cm Ramesh, Coronavirus, Corona Effect, Bjp-TeluguStop.com

ఇప్పటికే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదు కాగా,వెయ్యిమందికి పైగా మృత్యువాత పడ్డారు.ఇప్పుడు తాజాగా ఎంపీ సీఎం రమేశ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది అని ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లోనే ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

సీఎం రమేశ్ కు కూడా కరోనా పాజిటివ్ తేలడం తో ఆయన స్నేహితులు,శ్రేయోభిలాషులు,అభిమానులు ఆందోళనకు గురయ్యారు.అయితే తన ఆరోగ్యం పై ఎలాంటి ఆందోళన వద్దు అని ఆయన సమాచారం తో త్వరగా ఆయన ఈ మహమ్మారి నుంచి కోలుకోవాలని వారంతా ప్రార్థిస్తున్నారు.

టీడీపీ నేత ఆయిన సీఎం రమేశ్ గత ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో బీజేపీ పార్టీ లో చేరారు.గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎంపీ గా ఎన్నికైన రమేశ్ పార్టీ ఫిరాయించడం తో బీజేపీ ఎంపీ గా కొనసాగుతున్నారు.

రమేశ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు ఒకేసమయంలో బీజేపీ పార్టీ లో చేరిన విషయం విదితమే.దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతుండగా ,ప్రజా ప్రతినిధులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు మధ్యప్రదేశ్ సీఎం,కర్ణాటక సీఎం ఇలా చాలా మంది కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube