వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..!!

ఏపీ బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు.రాష్ట్రంలో ఇసుక బంగారం కంటే ఖరీదైనదిగా మార్చేశారని.

 Bjp Leader Made Serious Remarks On Ycp Government-TeluguStop.com

సామాన్యులకు ఇసుక దొరకకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు.రాష్ట్రంలో ఇసుక ను వందల కోట్ల వేల కోట్లకు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం అప్పగించిందని సామాన్యుడు ఇసుక విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, ఇసుక కొరత కారణంగా ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి తీసుకు వచ్చారని పేర్కొన్నారు.

అదేవిధంగా మద్యం ధరలు పెంచి సామాన్యులను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని పేదల డబ్బును ఖజానాకు తరలిస్తున్నారని విమర్శించారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో ఆలయాలపై దాడులు దేవుళ్ల రథాలు ధ్వంసం విగ్రహాల ధ్వంసం.

 Bjp Leader Made Serious Remarks On Ycp Government-వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవటం దారుణమని తెలిపారు.ఈ క్రమంలో దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేదని.

ద్వజమెత్తారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా దెబ్బతిన్నాయని.

ప్రజలను అన్ని విధాలుగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులపాలు చేస్తుందని, మళ్లీ ఇటువంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వెయ్యాలి అంటూ.విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు.

#BJP Remarks YCP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు