అప్పులను ఆదాయంగా చూపిస్తున్న ముఖ్యమంత్రి  

Bjp Leader Lakshman Comments On Telangana Cm Kcr-kaleswaram Project,kcr Frauds In Telangana Projects,kcr Is Brand Ambasedor For Lying

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంను అప్పుల రాష్ట్రంగా మార్చేశాడని, కాని ఆయన ప్రజలకు అప్పులను కూడా ఆదాయం మాదిరిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించాడు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ తీవ్రంగా మోసం చేస్తున్నాడు.

BJP Leader Lakshman Comments On Telangana CM KCR-Kaleswaram Project Kcr Frauds In Projects Kcr Is Brand Ambasedor For Lying

ఆయన చెప్తున్న అబద్దాలకు కాగ్‌ కూడా సీరియస్‌ అయ్యింది.అబద్దాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ మాదిరిగా ఆయన మారిపోయాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


BJP Leader Lakshman Comments On Telangana CM KCR-Kaleswaram Project Kcr Frauds In Projects Kcr Is Brand Ambasedor For Lying

తెలంగాణలో ఆర్ధిక పరిస్థితి గురించి ప్రభుత్వంపై కాగ్‌ పలు విషయాల్లో తప్పుబట్టింది.రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై కాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసిందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రంను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అడగలేదని ఆయన అన్నారు.ఇక తెలంగాణ పోరాట యోధులను కేసీఆర్‌ ఎప్పుడు చిన్న చూపే చూశారు.

గతంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ను వ్యక్తిగతంగా తిట్టిన వ్యక్తి కేసీఆర్‌.ఇక కొండాలక్ష్మణ్‌ బాపూజీ మరియు కోదండరాంలను నిర్లక్ష్యం చేయడంతో పాటు వారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తి కూడా సీఎం కేసీఆర్‌ అంటూ లక్ష్మణ్‌ విమర్శించారు.

తాజా వార్తలు

Bjp Leader Lakshman Comments On Telangana Cm Kcr-kaleswaram Project,kcr Frauds In Telangana Projects,kcr Is Brand Ambasedor For Lying Related....