కశ్మీర్‌లోని హిందూ ఆలయాలకు మోక్షం కలిగిస్తాం

స్వాతంత్య్రంకు ముందు కశ్మీర్‌లో హిందువులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది.కాని స్వాతంత్య్ర అనంతరం అక్కడ ఆర్టికల్‌ 370ని పెట్టడంతో పాటు పాకిస్తాన్‌కు చేరువగా ఉండటం వల్ల హిందువులకు ఇబ్బందులు మొదలయ్యాయి.

 Bjp Leader Kishanreddy Comments Kashmir Hindhu Temples And Cinima Shooting Star-TeluguStop.com

కశ్మీర్‌ అనగానే ముస్లీంలు అన్నట్లుగా పరిస్థితి మారింది.అక్కడ హిందువులు ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉంటూ వచ్చారు.

ఎప్పుడైతే కశ్మీర్‌ ఇండియాలో భాగం అన్నట్లుగా 370 ని రద్దు చేయడం జరిగిందో వెంటనే హిందువులకు హక్కులు దక్కినట్లయ్యింది.ఇక కశ్మీర్‌లో చాలా ఏళ్లుగా ఆధరణకు నోచుకోని ఆలయాలను మళ్లీ ఇప్పుడు పునరుద్దరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తాజాగా హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ కశ్మీర్‌లో ఉన్న 50 వేల హిందూ దేవాలయాలను పునరుద్దరించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.గత పాలకుల విధానాలు మరియు ఉగ్రవాదుల కార్యక్రమాల వల్ల హిందూ దేవాలయాల్లో పూజలు జరగడం లేదు.అందుకే దేవాలయాలన్నింటిలో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసి పునర్వైభవాన్ని తీసుకు వచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కిషన్‌ రెడ్డి అన్నారు.20 ఏళ్ల కాలంలో కశ్మీర్‌లో సినిమా థియేటర్ల పరిస్థితి కూడా దారుణంగా మారింది.కాని ఇప్పుడు వాటికి కూడా మహర్ధశ పట్టబోతుంది.షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వడంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామంటూ కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube