వైరల్: విదేశీ జెండా పోస్టు చేసి దొరికిపోయిన కుష్బూ!- Bjp Leader Khushboo Sundar Uses Flag Of Nigeria Instead Of Indian Tricolour While Wishing Republic Day

viral Khushboo found posting a foreign flag, bjp leader khushboo, repabulic day, telugu industry, indian flag, viral, foreign flag, twitter - Telugu Bjp Leader Khushbu, Foreign Flag, Indian Flag, Khushboo, Repabulic Day, Telugu Industry, Twitter, Viral

జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మన జాతీయ జెండా ను ఎగర వేయడం జరిగింది.ఇలా దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

 Bjp Leader Khushboo Sundar Uses Flag Of Nigeria Instead Of Indian Tricolour While Wishing Republic Day-TeluguStop.com

దేశ నాయకులు, ఇతర రంగాలకు చెందిన వాళ్ళు సోషల్ మీడియా వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉంటే నటి కుష్బూ విదేశీ జెండాను పోస్ట్ చేయగా.

ప్రస్తుతం వైరల్ గా మారింది.

 Bjp Leader Khushboo Sundar Uses Flag Of Nigeria Instead Of Indian Tricolour While Wishing Republic Day-వైరల్: విదేశీ జెండా పోస్టు చేసి దొరికిపోయిన కుష్బూ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినీ పరిశ్రమ నటి కుష్బూ గురించి అందరికీ తెలిసిందే.

తెలుగు, తమిళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే రాజకీయపరంగా భారతీయ జనతా పార్టీ లో చేరి తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది.

కాగా నిన్న గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రయత్నించగా.బోల్తా పడింది.

ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలందరికీ కుష్బూ భారత జెండాను పెట్టి పోస్ట్ చేసింది.కాగా తను పెట్టిన పోస్టులో మన జెండా కు బదులు.

వేరే దేశపు జెండా ఉండటంతో దేశవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంది.

మన దేశం జెండా వలె ఉన్న మరో దేశపు జెండాను పోస్ట్ చేసింది కుష్బూ.కాగా ఆ జెండాలో మన జెండా వలే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నప్పటికీ.ఆ జెండా మధ్యలో ఉన్న చిహ్నం వేరుగా ఉంటుంది.

దీంతో కుష్బూ ఆ జెండా ను చూసి మన జెండా అనుకొని పోస్ట్ చేసింది.రెండు జెండాలు ఒకే పోలికతో ఉండటంతో పొరపాటు పడిన కుష్బూ కు వ్యతిరేకమైన కామెంట్లు ఎదురయ్యాయి.

ఒక కామెంటర్ “నయా భారత్ లో భారత్ పథకం కూడా మారిందా” అని ప్రశ్నించగా.మరో వ్యక్తి “మీరు పార్టీ మారారని తెలుసు.కానీ దేశం కూడా మారారా?” అని ప్రశ్నించాడు.ఇలా చాలామంది కామెంటర్లు పలు విధాలుగా విమర్శించారు.దీనిని స్పందించిన కుష్బూ.“ట్వీట‌్ చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోలేదంటూ.ఇది సరైన ఆమోదం కానప్పటికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను.నా దేశం నా ఇండియా” అంటూ తెలిపింది.అంతేకాకుండా ఆ ట్వీట్ ను డిలీట్ చేసి.తన ప్రొఫైల్ పిక్ లో జాతీయ జెండాను పెట్టుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తన ట్వీట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

#Indian Flag #Foreign Flag #Repabulic Day #Viral #Khushboo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు