వామపక్షాలపై అలా... అధికార, ప్రతిపక్షాలపై ఇలా! జనసేనాని కీలక వ్యాఖ్యలు  

Janasena Chief Pawan Kalyan Comments On Tdp And Ysrcp-bjp,communists,janasena Comments,tdp And Ysrcp

ఏపీ రాజకీయాలలో ఈ రోజు మరో కీలక సమీకరణాలు చోటు చేసుకున్నాయి.ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న జనసేన, బీజేపీ పార్టీలు ఊహించని విధంగా జత కట్టాయి.

Janasena Chief Pawan Kalyan Comments On Tdp And Ysrcp-bjp,communists,janasena Comments,tdp And Ysrcp తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీ-Janasena Chief Pawan Kalyan Comments On TDP And YSRCP-Bjp Communists Janasena Tdp Ysrcp

చాలా కాలంగా రెండు పార్టీల మధ్య పొత్తుల విషయంలో చర్చలు జరుగుతున్న తాజాగా అవి అధికారికంగా ఒక కొలిక్కి వచ్చాయి.రెండు పార్టీల నేతలు బేటీ అయ్యి పొత్తుపై నిర్ధారించాయి.

ఇదిలా ఉంటే ఈ పొత్తు విషయంపై జనసేనాని మీడియాతో మాట్లాడుతున్నా సందర్భాలలో చాలా విషయాలు మాట్లాడారు.అందులో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఉండటం విశేషం.


అధికార పార్టీ ఏడు నెలల పాలన మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ టీడీపీపై కాస్తా ఘాటుగా విమర్శలు చేశారు.ఒక సిటీలో హైకోర్టు పెడితే అది రాజధాని అనరని, రాజధాని విషయంలో ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ సమాధానం చెప్పాలని, హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని అప్పుడు అన్న టీడీపీ, హోదాపై కేంద్రాన్ని నిలదీస్తాం అని మాటలు చెప్పిన వైసీపీని ప్రజలు నిలదీయాలని అన్నారు.ఏపీలో అభివృద్ధి జరగాలంటే కుల, వారసత్వ రాజకీయాలు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇక గత ఎన్నికలలో వామపక్షాలతో పొత్తు గురించి మాట్లాడుతూ వామపక్షాలకు నేనేమన్నా బాకీ పడ్డానా, వామపక్షాలతో కంటే ముందే నేను బీజేపీతో కలిసి పనిచేశానని పవన్‌కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వామపక్ష పార్టీలకి కోపం తెప్పించే విధంగా ఉన్నాయి.

తాజా వార్తలు

Janasena Chief Pawan Kalyan Comments On Tdp And Ysrcp-bjp,communists,janasena Comments,tdp And Ysrcp Related....