ప్రధాని తో కేసీఆర్ ! ఢిల్లీ విషయం బయటపెట్టిన బీజేపీ నేత ?

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ టూర్ కి వెళ్లారు.దాదాపు నాలుగైదు రోజులు అక్కడే మకాం వేసి ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు , బీజేపీ కేంద్ర మంత్రులు , నాయకులు కలిసి అనేక అంశాలపై చర్చించారు.

 Bjp Leader Jithendar Reddy Sensational Comments On Kcr-TeluguStop.com

ఢిల్లీలో టిఆర్ఎస్ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ పెద్దలను కలిశారు.అయితే ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా వంటి వారితో కేసీఆర్ చర్చించినా , ఏ అంశంపై వారి మధ్య చర్చ జరిగింది అనేది ఎవరికీ తెలియదు.

కాకపోతే బిజెపి పెద్దలను కలిసిన కొద్దిరోజులకే ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో, కెసిఆర్ ఢిల్లీ టూర్ వెనుక అసలు కారణం ఇదేనని, బిజెపి టీఆర్ఎస్ మధ్య లాలూచీ ఉందని ,రెండు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చే , ఈవిధంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు పెరిగిపోతున్నాయి.ఇక ఇదే అదనుగా కాంగ్రెస్ సైతం బిజెపి , టిఆర్ఎస్ ల ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

 Bjp Leader Jithendar Reddy Sensational Comments On Kcr-ప్రధాని తో కేసీఆర్ ఢిల్లీ విషయం బయటపెట్టిన బీజేపీ నేత -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎన్నికలు వాయిదా పడడంతో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయి.అయినా కెసిఆర్ కోసం కేంద్ర బిజెపి పెద్దలు ఎన్నికలు వాయిదా వేయించాలని ప్రచారం ఊపందుకోవడం, తదితర అంశాలపై తాజాగా బిజెపి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు.

హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని కెసిఆర్ కు ప్రధాని నరేంద్రమోదీ వద్దకు వెళ్లి ఎన్నికలను వాయిదా వేయించే అంత సత్తా లేదు అంటూ జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని , కావాలని అడ్డుకునేందుకు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని ఆయన విమర్శించారు.
 

Telugu Amith Sha, Bjp Leader Jithendar Reddy, Delhi Tour, Etela Rajender, Huzurabad Election, Kcr, Kcr Delhi Tour, Narendra Modi, Prime Minister Of India, Ts Politics-Political

హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ గెలవబోతున్నారు అని , త్వరలోనే విజయోత్సవాలు జరుపుకోబోతున్నారు అంటూ ఆయన జోస్యం చెప్పారు.టిఆర్ఎస్ కు ఓటమి భయంతోనే కుల సంఘాల సమావేశాలు నిర్వహిస్తూ,  కేసీఆర్ వరాల కురిపిస్తున్నారు అని,  డబ్బులు , మద్యం పంచినా, టీఆర్ఎస్ సభలకు జనం పెద్దగా వెళ్లడం లేదన్నారు.అసలు టిఆర్ఎస్ చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్మడం లేదని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.హుజురాబాద్ మధువని గార్డెన్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో జితేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

#Etela Rajender #Delhi #Narendra Modi #Prime India #Huzurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు