జీవో నెంబర్ 317 రద్దు చేయాల్సిందే అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.ఉద్యోగ ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదన కు గురిచేస్తున్న జీవో నెంబర్ 317ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులను పట్టించుకోకుండా వారిని సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ అనుచరులుగా మారిపోయి.
వారి స్వలాభం కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.