బీజేపీకి చెక్ పెట్టిన కేసీఆర్... గెలవడం కష్టమేనా?

తెలంగాణలో మరో రాజకీయ సమరం జరగబోతోంది.నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ స్థానం ఖాళీ అయింది.

 Bjp Key Leader Anjaiah Yadav Joins Trs, Trs,  Anjaiah Yadav,cm Kcr, Nagarjuna Sa-TeluguStop.com

ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది.ఇప్పటికే ప్రధాన పార్టీలు నాగార్జున సాగర్ విజయంపై ఫోకస్ పెట్టాయి.

ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో కసి మీద ఉన్న టీఆర్ఎస్ పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి కొంచెం పర్వాలేదని అనిపించినా దుబ్బాక ఉప ఎన్నిక ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయారు.అందుకే ఇప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపుపై కేసీఆర్ రకరకాల వ్యూహాలు రచిస్తున్నాడు.

అయితే దుబ్బాకలో బీజేపీ దెబ్బ తీయడంతో నాగార్జున సాగర్ ఎన్నికలో ఆ సీన్ రిపీట్ కావద్దని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.అందులో భాగంగా బీజేపీ కీలక నేతకు కేసీఆర్ గాలం వేశారు.

అందుకే బీజేపీ కీలక నేత అంజయ్య యాదవ్ కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.ఇప్పుడు ఈ నేత చేరికతో బీజేపీ బలం మొత్తం టీఆర్ఎస్ కు చేరినట్టయింది.

ఇప్పుడు బీజేపీ అంతర్మధనంలో పడింది.మామూలుగా బీజేపీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్యాడర్ లేదు.

ఇక కొద్దో గొప్పో ఉన్న నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరడంతో బీజేపీ బలహీనపడింది.మరి బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని రచిస్తుండనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube