చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. విజయశాంతి కామెంట్స్ వైరల్!

భారీ వర్షాల వల్ల ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులకు నష్టం వచ్చిన సంగతి తెలిసిందే.దక్షిణ కోస్తా, రాయలసీమలోని పదుల సంఖ్యలో ఇళ్లు నేలకూలాయి.

 Bjp Leader Actress Vijayashanti Respond On Ap Heavy Rains On Twitter , Vijayash-TeluguStop.com

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల చేతికందిన పంట నీట మునగడంతో రైతులు బాధ పడుతున్నారు.కడప జిల్లాకు చెందిన 24 గ్రామాల ప్రజలు చెయ్యేరు వరద వల్ల సర్వం కోల్పోయారు.

వేల సంఖ్యలో మూగజీవాలు వరదల వల్ల ప్రాణాలు కోల్పోయాయి.

బీజేపీ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి ఏపీలో వరదలు మిగిల్చిన విషాదం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలోని రాయలసీమ, నెల్లూరు ప్రజలు పడుతున్న అగచాట్లను చూస్తుంటే గుండె బరువెక్కుతోందని విజయశాంతి అన్నారు.ఏపీ ఎడతెగని వర్షాల వల్ల కన్నీటి కడలిలా మారిందని ఆమె చెప్పుకొచ్చారు.

వరదల వల్ల రాయలసీమ, నెల్లూరు ప్రజల జీవితాలు చెల్లాచెదురయ్యాయని విజయశాంతి పేర్కొన్నారు.

Telugu Andra Pradesh, Ap Troubles, Flood, Heavy, Respond, Vijayashanti, Ys Jagan

వీళ్ల జీవితాలు త్వరితగతిన గాడిన పడేలా చేయాలని ఆ పరమాత్మను తాను కోరుకుంటున్నానని విజయశాంతి చెప్పుకొచ్చారు.రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అయితే మరిన్ని మానవ వనరుల సాయం అవసరమని తనకు అనిపిస్తోందని విజయశాంతి కామెంట్లు చేశారు.ఎన్.సీ.సీ.విద్యార్థుల యొక్క సహాయ సహకారాలను తీసుకుంటే పరిస్థితులను త్వరగా చక్కబెట్టవచ్చని విజయశాంతి అన్నారు.

Telugu Andra Pradesh, Ap Troubles, Flood, Heavy, Respond, Vijayashanti, Ys Jagan

ప్రజలను ఆదుకోవడం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు, అధికార యంత్రాంగాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయని విజయశాంతి తెలిపారు.ఇంటి సభ్యులలా ఉన్న పశు సంపద మౌనంగా రోదిస్తూ జలప్రవాహంలో కలిసిపోయిందని విజయశాంతి పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వం వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.

సెలబ్రిటీలు తమ వంతు సాయం ప్రకటిస్తే వరదల వల్ల కష్టాలు పడుతున్న ప్రజలకు మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube