పరుగులు పెట్టిస్తామంటున్న జనసేన బీజేపీ ?  

Bjp Janasena Party Coordination Meeting On Ap Local Body Elections - Telugu Ap Local Body Elections, Bjp-janasena Party, Coordination Meeting, Daggubati Purandeswari

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ఏపీలో మొదలైపోయింది.అన్ని రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలకు పదును పెడుతూ… స్థానిక పోరులో హీరో అవ్వాలని చూస్తున్నాయి.

 Bjp Janasena Party Coordination Meeting On Ap Local Body Elections

ఇక ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ఏపీ పంచాయతీ రాజ్ చట్టంలో కఠినమైన నియమాలను అమల్లోకి తీసుకు వచ్చింది.ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఎక్కడా అవినీతి, మద్యం అనేది లేకుండా చేయాలని చూస్తోంది.

ఈ సంగతులన్నీ ఇలా ఉంటే, స్థానిక పోరులో విజేతగా నిలవాలనే ఆశతో జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి.క్షేత్రస్థాయిలో తమకు అంత పట్టు లేకపోయినా, పవన్ కు ఉన్న ఇమేజ్ తో గట్టెక్కాలని ఈ రెండు పార్టీల నాయకులు భావిస్తున్నారు.

పరుగులు పెట్టిస్తామంటున్న జనసేన బీజేపీ -Political-Telugu Tollywood Photo Image

ఈ మేరకు అభ్యర్థుల ఎంపిక కూడా త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో బిజెపి జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ జి హాజరయ్యారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి ముందుకు వెళ్లే విషయంలో లోతుగా చర్చించారు.

అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.బిజెపి, జనసేన రెండు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యా యని, ఈనెల 12వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తామని, భవిష్యత్తులోనూ బిజెపి, జనసేన పొత్తు పెట్టుకునే ముందుకు వెళ్తాయని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ తమ కూటమి తరపున అభ్యర్థులు పోటీ చేస్తారని నాదెండ్ల ప్రకటించారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై నాదెండ్ల విమర్శలు చేశారు.

భయంతో కూడిన కక్షపూరిత చర్యలతో ప్రభుత్వం సమయాన్ని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, ఈ తరహా పరిపాలన వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్దామని, భవిష్యత్తులో తమ రెండు పార్టీలు కలిసి ప్రజా ఉద్యమాలు చేయడంతో పాటు, మోదీ నాయకత్వంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా కృషి చేస్తామని బిజెపి సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు.ప్రతిపక్షాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చూస్తోందని, ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పి కొట్టే విధంగా తమ రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు