ఉద్యమకారులే లక్ష్యంగా బీజేపీ ఏం చేయబోతోంది అంటే ..?

ప్రస్తుతం దూకుడుగా రాజకీయ వ్యవహారాలు చేస్తున్న తెలంగాణ బిజెపి మరింత దూకుడు ను ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది.ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు.

 Bjp Is Trying To Get Telangana Activists To Join The Party Telangana Bjp, Trs, K-TeluguStop.com

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తనను అరెస్టు చేయడంతో తమ క్రేజ్ పెరిగిందని , జాతీయ నాయకుల నుంచి గ్రామ స్థాయి నాయకులు వరకు అంతా యాక్టిివ్ అయ్యారని సంజయ్ నమ్ముతున్నారు.ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం ఇప్పుడు పార్టీ నేతలకు పూర్తిగా స్వేచ్ఛను కల్పించింది.

పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించడంతో , ఇప్పుడు రాష్ట్ర బిజెపి నాయకులు అంతా యాక్టివ్ అయ్యారు.
      దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉండేలా చూస్తున్నారు.

అది కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటే తెలంగాణలో బిజెపికి తిరిగే ఉండదని నమ్ముతారు.  గత కొద్ది రోజులుగా ఇదే విషయంపై కసరత్తు చేస్తున్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలతో పాటు, ఉద్యమకారులలోనూ తీవ్ర వ్యతిరేకత ఉండటంతో దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బిజెపి వ్యూహం పన్నుతోంది. 
 

దీనిలో భాగంగానే పెద్ద ఎత్తున నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది.సంక్రాంతి పండుగ సమయంలోనే పెద్ద ఎత్తున ఉద్యమకారులను పార్టీలో చేర్చుకోవాలని వ్యూహం ముందుగా పన్నినా, కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరమవుతుండడం తదితర కారణాలతో వాయిదా వేసుకుందట.సరైన సమయం చూసి పెద్ద ఎత్తున నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు తెలంగాణ బిజెపి ప్రయత్నాలు చేస్తోందట.

టిఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యం లేక అసంతృప్తితో ఉన్న నాయకులను గుర్తించి బీజేపీలో చేరేందుకు ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారట.పార్టీలో చేరిన వారికి భవిష్యత్తులో కీలకమైన పదవులు ఇచ్చి సరైన ప్రాధాన్యం కల్పిస్తామనే హామీలు కూడా ఇస్తున్నారట.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube