ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై బీజేపీ సైలెంట్‌.. కార‌ణ‌మేంటి..?

సాధారణ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసిన తర్వాత జనసేనాని పవన్ తీసుకున్న నిర్ణయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.ఆయన ఎవరూ ఊహించని విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సమాయత్తమయ్యారు.

 Bjp Is Silent On Pawan's Affair . What Is The Reason ..?, Bjp, Pawan, Ap  Poltic-TeluguStop.com

బీజేపీ అధిష్టానం పవన్ తో పొత్తుకు సై అనడంతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకోవాల్సి వచ్చింది.పవన్ తో పొత్తు ఉన్న మాటే కానీ ఏనాడు బీజేపీ జనసేనను వెనకేసుకురాలేదు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు బీజేపీ నేతలు జనసేనను వదిలించుకోవాలని చూస్తున్నట్లు తేటతెల్లమవుతోంది.

పవన్ కు రాజకీయంగా ఎలాంటి ఆపద వచ్చినా సరే ఆయనే సొంతంగా చక్కబెట్టుకున్నారు కానీ పొత్తు పెట్టుకున్న బీజేపీ ఏనాడు సాయం చేయలేదని పలువురు జనసైనికులు అంటున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల విషయంలో కూడా జనసేన పోటీ చేస్తానంటే ఒప్పుకోని బీజేపీ నేతలు పోటీ చేసి పరువు పోగొట్టుకున్నారు.ఫ్యాన్ గాలి ముందు నిలబడలేకపోయారు.

ఈ విషయంలో జన సైనికులు బాగా హర్ట్ అయ్యారు.అనవసరంగా బీజేపీ తిరుపతిలో పోటీ చేసిందని తమకు ఆ స్థానాన్ని వదిలి పెడితే రిజల్ట్ వేరే గా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap Poltics, Bjp, Chandrababu, Janaseena, Lokesh, Pawan, Sommuveeraju, Tdp

ఈ అన్ని పరిణామాలతో విసుగు చెందిన పవన్ టీడీపీతో కలిసేందుకు సమాయత్తమవుతున్నారని టాక్ నడుస్తోంది.టీడీపీ – జనసేన పొత్తు ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి.ఎంత కలుపుకుని పోదామనుకున్నా సరే బీజేపీ తమతో కలవడం లేదని జన సైనికులు ఆరోపిస్తున్నారు.ఎన్నికల నాటికి టీడీపీ జనసేన మైత్రి మరింత బలపడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

వైసీపీ నేతల వ్యాఖ్యలు కూడా ఈ విషయాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.దమ్ముంటే పవన్ ఒంటరిగా పోటీ చేసేందుకు ముందుకు రావాలని వారు సవాల్ విసురుతున్నారు.పవన్ టీడీపీకి దగ్గరవుతున్నా సరే బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని అందరూ ఆలోచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube