జగన్ ను ఇబ్బందిపెట్టబోతున్న ' టిప్పు సుల్తాన్ ' ?

ప్రత్యక్షంగానో, పరోక్షంగానూ బీజేపీ విషయంలో జగన్ సానుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.అన్ని రకాలుగా మద్దతిస్తూ, మద్దతు పొందుతూ వస్తున్నారు.

 Bjp Is Angry With Ycp Over Setting Up Of Tip Sultan Statue-TeluguStop.com

బిజెపికి ఎక్కడ ఆగ్రహం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.అయితే ఇప్పుడు ఓ విషయం జగన్ కు ఇబ్బంది కరంగా మారింది.

వైసిపి విషయంలో బీజేపీ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది.దీనికి కారణం ” టిప్పు సుల్తాన్ ” విగ్రహం.

 Bjp Is Angry With Ycp Over Setting Up Of Tip Sultan Statue-జగన్ ను ఇబ్బందిపెట్టబోతున్న టిప్పు సుల్తాన్ -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది కూడా జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్న టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలోనే.కడప జిల్లా ప్రొద్దుటూరులో కొంతమంది మైనారిటీ నేతల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్ణాటకలో ఇప్పటికే టిప్పుసల్తాన్ జయంతి  కార్యక్రమాలను చేయడంపై బిజెపి మండి పడుతూ వస్తోంది.

Telugu Ap, Bjp, Jagan, Kadapa, Prodduturu, Tippu Sulthan, Vishnuvardhan Reddy, Ysrcp-Telugu Political News

వాటిని ఎలాగైనా ఇకముందు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తోంది.అయితే ఏపీలో తమకు పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్న వైసిపి ఎమ్మెల్యే అధ్వర్యంలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేస్తుండడం బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది.దీనిపై ఎన్నో అభ్యంతరాలను బీజేపీ లేవనెత్తుతోంది.

అసలు ముందుగా టిప్పు సుల్తాన్ జీవిత చరిత్ర తెలుసుకొని అప్పుడు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అంటూ బీజేపీ నేతలు సూచిస్తున్నారు.ఈ వ్యవహారంలో బీజేపీ చాలా సీరియస్ గానే ఉంది.

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వ్యవహారంపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేసుకుంటోంది.

అయితే ఇప్పుడు జగన్ బిజెపిల మధ్య సఖ్యత ఏర్పడుతున్న సమయంలో మళ్లీ ఈ వ్యవహారం కారణంగా రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగే అవకాశం కనిపిస్తోంది.

అయితే దీనిపై జగన్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు ఈ అంశాన్ని ఏ విధంగా సద్దుమణిగేలా చేస్తారని ఈ విషయంపై ఉత్కంఠ నెలకొంది.

#Prodduturu #Tippu Sulthan #Kadapa #Jagan #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు