హుజురాబాద్ లో గెలుపుపై పట్టుదలతో బీజేపీ...

తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది.టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో దుబ్బాక ఉప ఎన్నిక అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని క్రితం కంటే ఎలాగైతే బలపడిందో అదే వ్యూహాన్ని హుజూరాబాద్ లో అమలు చేస్తోంది.

 Bjp Insists On Winning In Huzurabad ... Will It Win Again Etela Rajender, Bjp P-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఈటెలకు హుజూరాబాద్ లో వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్నా బీజేపీ పార్టీకే ఈటెల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి జరుగుతున్న పరిస్థితి ఉంది.ఎందుకంటే బీజేపీకి హుజూరాబాద్ లో బలం లేదు కాబట్టి ఈటెల క్యాడర్ ద్వారా బీజేపీ అనేది ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితి ఉంది.

అయితే హుజూరాబాద్ లో కూడా దుబ్బాక తరహాలో గెలిచి టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇవ్వాలని బీజేపీ చాలా రకాలుగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న  బండి సంజయ్ తన యాత్రను హుజురాబాద్ లో ముగిసేలా ప్రణాళిక రచించుకున్న పరిస్థితి ఉంది.

అయితే టీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో బీజేపీకి టీఆర్ఎస్ కు మధ్య పోటాపోటీ వాతావరణం ఉండే అవకాశం ఉంది.అయితే ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో ఓటు బ్యాంక్ ను పెంచుకుంటూ సామాన్య ప్రజల మద్దతు ఉండేలా ప్రజలను బీజేపీ వైపు తిప్పుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే బీజేపీ భావిస్తున్న ముఖ్య విషయం ఏమిటంటే ఎక్కడైతే బీజేపీ గెలిచే అవకాశాలు లేని పరిస్థితులు ఎదురవుతున్న పరిస్థితులలో ఎలాగైనా బీజేపీ తరహా రాజకీయాన్ని ప్రారంభించి గెలిచే అవకాశాలను పునరుద్దరించుకోవాలని బీజేపీ భావిస్తోంది.అయితే టీఆర్ఎస్ మాత్రం బీజేపీ ఎత్తుగడలను గమనిస్తూనే వాటికి చెక్ పెట్టె విధంగా వ్యవహరిస్తూ బీజేపీ ఎత్తులను చిత్తు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.

మరి హుజూరాబాద్ లో బీజేపీ సత్తా చాటుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube