తెలంగాణ బీజేపీ నేతలకు ప్రమోషన్లు ? ఓహో ఇదా సంగతి ?

తెలంగాణ బీజేపీ నేతలకు బంపర్ ఆఫర్ లు ఇచ్చేందుకు బిజెపి అధిష్టానం సిద్ధమై పోయినట్లుగా కనిపిస్తోంది.దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బిజెపి ప్రయత్నిస్తున్నా, అది సాధ్యం కావడం లేదు.

 Bjp In The Idea Of ​​giving Promotions To Telangana Bjp Leaders, Bandi Sanja-TeluguStop.com

కానీ తెలంగాణలో అనూహ్యంగా వచ్చిన ఊపు తో బిజెపి లో  ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది.ఇదే స్పీడ్ తో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రాగలము అనే నమ్మకం బీజేపీ అధిష్టానానికి కనిపిస్తోంది.

ఇక్కడ కనుక అధికారంలోకి వస్తే క్రమంగా ఏపీలోనూ పాగా వేయవచ్చు అనే ఉద్దేశంలో బిజెపి ఉంది.అందుకే తెలంగాణ బిజెపి నాయకుల్లో మరింత ఉత్సాహం పెంచేందుకు వారికి ప్రత్యేకమైన పదవులను అప్పగించి మరింత ప్రోత్సహించాలని  నిర్ణయించుకుంది.

Telugu Bandi Sanjay, Central, Dubbaka, Greter, Kishan Reddy, Modhi, Telangana-Te

ఇప్పటికే కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి ఇచ్చారు.ఆయన కాకుండా మరొకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయంలో బీజేపీ అధిష్టానం ఉంది.ఇవే కాకుండా కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవులను ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో బలపడపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి.పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపికి దక్షిణాది రాష్ట్రలు కీలకంగా మారుతున్నాయి.ఉత్తరాదిలో బీజేపీకి గరిష్టస్థాయిలో ఎంపీ సీట్లు ఉన్నాయి.

కానీ అక్కడ సీట్లు పెరిగే అవకాశం కనిపించడం లేదు.కానీ దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవడం ద్వారా తమకు ఆ లోటు తీరిపోతుందనే నమ్మకం బీజేపీ పెద్దలు పెట్టుకోవడం తో ఇప్పుడు ఏపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు.

 దుబ్బాక ఉప ఎన్నికలు గ్రేటర్ సాధించిన సీట్లు ఇలా అన్ని లెక్కలు వేసుకుంటున్నారు.పార్టీ నేతలను యాక్టివ్ చేసే అన్ని విషయాలను సాధించే విధంగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువైంది.బిజెపి ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube