కీలక నేతల ప్రచారంతో జోష్ లో బీజేపీ.. సత్తా చాటేనా?

Bjp In Josh With The Campaign Of Key Leaders Marisatta Chatena

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు బీజేపీ బలపడుతోంది.రెండో సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఏ మాత్రం బలంగా లేని బీజేపీ దుబ్బాక ఉప ఎన్నిక తరువాత ఒక్కసారిగా ఆశ్చర్యంగా పుంజుకున్న పరిస్థితి ఉంది.

 Bjp In Josh With The Campaign Of Key Leaders Marisatta Chatena-TeluguStop.com

ఇక అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ స్థానం కోసం కాంగ్రెస్ తో కలిసి పోటీ పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.అయితే  దుబ్బాక లో టీఆర్ఎస్ ను ఓడించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా నాలుగు స్థానాల నుండి నలభై స్థానానికి ఎగబాకిన విషయం విదితమే.

ఆ తరువాత జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటికి ఇప్పుడు హుజూరాబాద్ లో గెలిచి తీరాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది.కానీ బీజేపీ గెలుపు కొరకు ఆశలు పెట్టుకోవడానికి ప్రధాన కారణం  ఈటెల రాజేందర్.

 Bjp In Josh With The Campaign Of Key Leaders Marisatta Chatena-కీలక నేతల ప్రచారంతో జోష్ లో బీజేపీ… మరిసత్తా చాటేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి అసలు బలం లేదు.

అక్కడ బీజేపీకి బలమైన క్యాడర్ లేదు.

కానీ ఈటెల టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన తరువాత ఈటెల మీద పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమయిన పరిస్థితుల్లో ఈటెల బీజేపీలో చేరడంతో బీజేపీ హుజూరాబాద్ లో టీఆర్ఎస్ తరువాత రెండో స్థానంలో ఉండగలిగింది.అయితే ప్రస్తుతం ఈటెల గెలుపు కు పెద్దగా ఆశలు లేకపోవడంతో బీజేపీ పై పెద్దగా గెలుస్తుందనే ప్రచారం మాత్రం జరగడం లేదు.

ప్రస్తుతం బీజేపీ కీలక నేతలు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు ప్రచారాం చేస్తుండటంతో బీజేపీ కి, టీఆర్ఎస్ కు మధ్య మాటల తూటాలు పేలి హుజూరాబాద్ లో రాజకీయ వాతావరణం హీటెక్కిన పరిస్థితి ఉంది.మరి హుజూరాబాద్ లో బీజేపీ సత్తా చాటుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

#Bandi Sanjay #Huzurabad #Etala #Potics #@BJP4Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube