తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య వరుస విమర్శలు ప్రతివిమర్శలతో హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం తెలంగాణకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ పార్టీకి కేసీఆర్ వ్యాఖ్యలు ఒక్కసారిగా దెబ్బ తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ ఆగ్రహం ఒక్కసారిగా సామాన్య ప్రజలను ఆలోచింపజేసింది.తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగికి వరి పంట కొనేది లేదని ప్రకటించింది.
అయితే ఈ ప్రకటన పట్ల బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కేసీఆర్ మెడలు వంచైనా పంట కొనుగోలు చేసేలా చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయమని తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ పంపించి చెప్పినా రైతులను వరి కొనుగోలు చేయమని ఎలా బీజేపీ పార్టీ వాళ్ళు ఎలా చెబుతారని కేసీఆర్ బండి సంజయ్ ను నిలదీసిన పరిస్థితి ఉంది.
అయితే కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ తో ఒక్కసారిగా బీజేపీ ఇరకాటంలో పడింది.కేసీఆర్ స్పీచ్ పై రాజకీయ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సూటిగా కేంద్రం చేస్తున్న పనిని రైతులకు చక్కగా వివరించారని రాజకీయ కోణాన్ని కూడా చక్కగా వివరించే ప్రయత్నం చేశారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.అయితే కేసీఆర్ చేసిన ఈ కామెంట్స్ పై బీజేపీ నాయకులు పెద్దగా స్పందించిన పరిస్థితి లేదు.ఎందుకంటే కేసీఆర్ పూర్తి ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన లెటర్స్ ప్రధాన కారణం.ఏది ఏమైనా కేసీఆర్ వ్యాఖ్యలు బీజేపీలో కూడా ఒకింత చర్చ జరిగిన మాట వాస్తవం.
మరి బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కేసీఆర్ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.