బెంగాల్‌ రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామం.. బీజేపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత.. !

బీజేపీ కి అప్పుడప్పుడు గట్టి దెబ్బలు తగలడం సర్వసాధారణం అయిపోయిందట కాగా తాజాగా బెంగాల్ రాజకీయ స్క్రీన్ పై అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.ఇప్పటి వరకు బీజేపీ తరపున అలీపూర్‌ద్వార్‌ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న గంగాప్రసాద్‌ శర్మ కమళాన్ని వీడి తృణమూల్‌లో చేరనున్నట్లు ప్రకటించడంతో ఒక్క సారిగా ఇక్కది రాజకీయాలు వేడెక్కాయట.

 Bjp In Bengal Key Leader Left Party To Join-TeluguStop.com

ఇకపోతే ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అలీద్వార్‌పూర్‌ జిల్లాలో ఉన్న అన్ని స్థానాల్లో బీజేపీయే విజయం సాధించింది.ఈ విజయం వెనక గంగా ప్రసాద్‌ కృషి ఉన్నదనే వాదన వినిపిస్తుంది.

 Bjp In Bengal Key Leader Left Party To Join-బెంగాల్‌ రాజకీయాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామం.. బీజేపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలో గంగా ప్రసాద్‌ బీజేపీని వీడడం బెంగాల్‌లో కమలానికి గట్టి దెబ్బ తగిలినట్లే అనే చర్చ జరుగుతోందట.కాగా జిల్లాకు చెందిన మరో ఏడుగురు కీలక నేతలు సైతం ఇతనితో కలిసి టీఎంసీలో చేరనున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఉత్తర బెంగాల్‌ను విభజించి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని బీజేపీకి చెందిన పలువురు ఎంపీలు కోరడం వల్లనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు గంగా ప్రసాద్‌ ప్రకటించడం కొసమెరుపు.

#Bengal #Left Party #Join TMC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు