టిప్పు జయంతి వేడుకలను రద్దు చేస్తూ యడ్యూరప్ప సర్కార్ సంచలన నిర్ణయం  

Bjp Govt In Karnataka Cancels Tipu Jayanti Celebrations-

కర్ణాటకలో బీజేపీ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కర్ణాటక సీఎం గా బీజేపీ నేత యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం కూడా చేశారు.

Bjp Govt In Karnataka Cancels Tipu Jayanti Celebrations--BJP Govt In Karnataka Cancels Tipu Jayanti Celebrations-

అయితే అలా అధికారంలోకి వచ్చారో లేదో తమదైన శైలి లో పాలన సాగిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు.రాష్ట్రంలో జరిగే టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను పూర్తిగా రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Bjp Govt In Karnataka Cancels Tipu Jayanti Celebrations--BJP Govt In Karnataka Cancels Tipu Jayanti Celebrations-

ప్రతి ఏటా నవంబర్ 10 న జరగబోయే ఈ ఉత్సవాలను పూర్తిగా రద్దు చేయాలనీ,ఎలాంటి జయంతి ఉత్సావాలు నిర్వహించరాదంటూ ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.2014 నుంచి కర్ణాటక సర్కార్ ఈ టిప్పు సుల్తాన్ వేడుకలను నిర్వహిస్తూ వస్తుండగా ఇప్పటివరకు కూడా ఆ సంప్రదాయం కంటిన్యు అవుతూ వచ్చింది.

అయితే టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి అని ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించరాదంటూ, వాటిని అవసరమైతే అడ్డుకుంటాం అంటూ బీజేపీ నేతలు వాదిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే గతేడాది ఈ వేడుకల నిర్వహణ సమయంలో 144 సెక్షన్ కూడా విధించింది అప్పటి సంకీర్ణ ప్రభుత్వం.అయితే ఇప్పుడు ప్రభుత్వం చేతులు మారి బీజేపీ అధికారంలోకి రాగానే ఆ జయంతి వేడుకలను ఆపేయాలంటూ సంచలన నిర్ణయం తీసుకుంది.