ఇంత చేసినా.. బీజేపీకి వ‌చ్చేది అన్ని కార్పొరేట‌ర్లేనా…  గ్రేట‌ర్ నాడి  !  

గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీ దూకుడు మామూలుగా లేదు.ఎక్క‌డిక‌క్క‌డ నేత‌ల‌ను మోహ‌రించ‌డంతోపాటు అతిర‌థ మ‌హార‌థులు గ్రేట‌ర్‌ను కమ్మేసి కుమ్మేశారు.

TeluguStop.com - Bjp Got Only This Much Of Corporate Seats In Ghmc Elections

చివ‌రిరోజు ఫినిషింగ్ ట‌చ్ మాదిరిగా బీజేపీ అగ్ర‌నాయ‌కుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వ‌చ్చి కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు.ఇక‌, కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, స్మృతి ఇరానీ వంటి వారు కూడా ఇక్క‌డ రెచ్చిపోయారు.

యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఫ‌డ‌ణ‌వీస్ వంటివారు కూడా వ‌చ్చి ఇక్క‌డ బీజేపీ ప్ర‌చారాన్ని జోరు పెంచారు.ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి ప్ర‌చారం చేస్తార‌ని అనుకున్నా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

TeluguStop.com - ఇంత చేసినా.. బీజేపీకి వ‌చ్చేది అన్ని కార్పొరేట‌ర్లేనా…  గ్రేట‌ర్ నాడి  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

మొత్తంగా బీజేపీ ప్ర‌చారం గ‌తానికి భిన్నంగా సాగింది.

దీనికి రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ఒక‌టి దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ పుంజుకుంది.దీంతో త‌మ‌కు ఎడ్జ్ ఉంటుంద‌ని ప్ర‌య‌త్న లోపంవ‌ల్లే ఇప్ప‌టి వ‌ర‌కు పుంజుకోలేక పోయామ‌ని బీజేపీ భావిస్తోంది.

ఇదే విష‌యంపై సమాలోచ‌న‌లు చేసిన అగ్ర నాయ‌కులు అన్ని విధాలా ఆలోచించి కీల‌క నేత‌ల‌ను గ్రేట‌ర్‌పై మోహ‌రించింది.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా స్తానిక ఎన్నిక‌లు కాస్తా సార్వ‌త్రిక స‌మ‌రాన్ని మ‌రిపించాయి.

మొత్తంగా ప‌రిశీలిస్తే బీజేపీ చాలా స‌వాలుగా తీసుకుని గ్రేట‌ర్‌లో పోరాడింది.

అయితే ఇది ఏమేర‌కు బీజేపీకి మార్కులు వేయిస్తుంది ? గ‌్రేట‌ర్ నాడి ఎలా ఉంది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి.ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన నేప‌థ్యంలో మేధావులు చెబుతున్న మాట‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.అదేంటంటే గ‌తంలో జ‌రిగిన గ్రేట‌ర్‌లో బీజేపీకి కేవ‌లం నాలుగు స్తానాలే ద‌క్కాయి.

అలాంటి పార్టీ ఇప్పుడు గ్రేట‌ర్ పీఠం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం చాలా చిత్రంగా ఉంద‌నేది మేధావుల మాట‌.ప్ర‌స్తుతం ఉన్న బ‌లాబ‌లాల‌ను ప‌రిశీలిస్తే 150 కార్పొరేటర్లు  + 52  ఎక్స్ అఫిషియో ఓట్లు = 202 మొత్తం సంఖ్య‌.

దీనిలో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కాలంటే అంటే మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవాలంటే 99 స్థానాల్లో విజ‌యం సాధించాలి.

అంటే 99 డివిజ‌న్లు బీజేపీ కైవ‌సం చేసుకోవాలి.

ఈ పార్టీకి ఎక్స్ అఫిషియో ఓట్లు కేవ‌లం మూడు మాత్ర‌మే ఉన్నాయి.సో ఈ సంఖ్య‌ను ప‌రిశీలిస్తే బీజేపీ ప్ర‌య‌త్నాలు ఏమేర‌కు ఫ‌లిస్తాయో స్ప‌ష్టం అవుతుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను బ‌ట్టి పాతిక డివిజ‌న్ల‌లో పాగా వేసే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని కొంద‌రు అంటుంటే డ‌బుల్ డిజిట్ చేరుతుంద‌ని అంతేతప్ప పాతిక క‌ష్ట‌మ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.ఏదేమైనా బీజేపీ ప్ర‌చారానికి వ‌చ్చే డివిజ‌న్ల‌కు పొంత‌న ఉండే అవ‌కాశం లేక‌పోయినా వ్యూహం మాత్రం బీజేపీని ఇక్క‌డ నిల‌బెట్ట‌డం అనేది బాగుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

#Telangana #GHMC Elections #Corporate Seats #TRS Government #Political War

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Bjp Got Only This Much Of Corporate Seats In Ghmc Elections Related Telugu News,Photos/Pics,Images..