బీజేపీ ఆఫర్ బాబు కి నచ్చలేదా ?

బిజెపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీలో మరోసారి తమ బలం పెంచుకుని వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని తెలుగుదేశం పార్టీ ఎదురు చూపులు చూస్తోంది.అందుకే గతంలో బీజేపీపై తాము చేసిన విమర్శలన్నిటిని మర్చిపోయి ఇప్పుడు స్నేహ హస్తం అందిస్తోంది.

 Bjp Give The Offer To Tdp Party-TeluguStop.com

ఏపీలో జగన్ ప్రభుత్వం బలంగా ఉండడంతో పాటు టిడిపి నాయకులు, ఎమ్మెల్యేలు బిజెపి వైపు, వైసీపీ వైపు చూస్తుండడంతో ముందు ముందు పార్టీ మరింత బలహీనపడుతుందని, అదే కాకుండా బిజెపిలోకి సుమారు పది మంది ఎమ్మెల్యేలు వెళ్లేందుకు సిద్దమవుతుండడంతో వారి వలసలకు బ్రేక్ వేసేందుకు ఇంకా అనేక కారణాలతో బిజెపికి దగ్గరవ్వాలని చంద్రబాబు చూస్తున్నాడు.

Telugu Apformar, Bjp Give Tdp, Chandrababurss, Tdpmlas-

ఇప్పటికే టిడిపి రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం అంతా బాబు ఆలోచనేనని అంతా భావిస్తున్నారు.దానికి తగ్గట్టుగానే బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు చంద్రబాబుకు మద్దతుగా పావులు కదుపుతున్నారు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే.

Telugu Apformar, Bjp Give Tdp, Chandrababurss, Tdpmlas-

వారి ద్వారానే చంద్రబాబు బీజేపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.అదేవిధంగా ఆర్ ఎస్ ఎస్ నేతలతోనూ పాత పరిచయాలను గుర్తు చేస్తూ బీజేపీతో పొత్తు సెట్ చేయవలసిందిగా వారిని కోరుతున్నాడు.అయితే బీజేపీ టిడిపితో పొత్తు పెట్టుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఏపీలో బలపడాలని తాము ఎప్పటి నుంచో చూస్తున్నాపొత్తుల కారణంగా సొంతంగా ఎదగలేక పోతున్నామని, ఇప్పుడు ఎదిగే అవకాశం ఉన్న నేపథ్యంలో టిడిపితో పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని బిజెపి నేతలు ఆలోచనలో పడ్డారు.

Telugu Apformar, Bjp Give Tdp, Chandrababurss, Tdpmlas-

ఈ నేపథ్యంలో బిజెపితో టిడిపి పొత్తు అంశాన్ని ప్రస్తావించి మధ్యవర్తుల ద్వారా టిడిపిని బీజేపీ లో విలీనం చేయాల్సిందిగా ప్రతిపాదనను బీజేపీ పెద్దలు పెట్టారట.దీనిపై చంద్రబాబు నో చెప్పినట్టు తెలుస్తోంది.అవసరమైతే బిజెపి పెట్టే అన్ని షరతులను ఒప్పుకుంటామనే సంకేతాలను పంపినట్టు తెలుస్తోంది.

ఇక బీజేపీ మాత్రం పొత్తుల అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ సొంతంగా బలం పెంచుకుని ఎన్నికల నాటికి ఎన్నో కొన్ని సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది.అందుకే తమకు ఏపీలో బలం లేకపోయినా టీడీపీ తో పొత్తు పెట్టుకునే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube