మందకృష్ణ మాదిగతో బీజేపీ దోస్తీ...అసలు వ్యూహం ఇదే?

హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ పకడ్భందీ వ్యూహాలు  రచిస్తున్న పరిస్థితి ఉంది.ఎన్నికలో గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు.

 Bjp Friendship With Mandakrishna Madiga Is This The Real-TeluguStop.com

ఈ ఉప ఎన్నిక కంటే ముందు బీజేపీకి హుజూరాబాద్ లో అంతగా బలం లేదన్న విషయం మనకు తెలిసిందే.కానీ టీఆర్ఎస్ నుండి ఈటెల రాజేందర్ బయటికి వచ్చిన తరువాత బీజేపీలో చేరటం బీజేపీకి లాభం చేకూరినట్టయింది.

ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం ఈటెల రాజేందర్ బీజేపీలో చేరటం బీజేపీకి ఒక ఉపయోగకర విషయమైనప్పటికి దళిత ఓటర్లు దూరమవడం బీజేపీ గెలుపుకు అడ్డంకిగా మారిన పరిస్థితి ఉంది.

 Bjp Friendship With Mandakrishna Madiga Is This The Real-మందకృష్ణ మాదిగతో బీజేపీ దోస్తీ…అసలు వ్యూహం ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బీజేపీ అడ్డంకి మారిందనే విషయాన్ని ఒకసారి విశ్లేషిస్తే హుజూరాబాద్ లో నలభై వేలకు పైగా దళితుల ఓట్లు ఉన్న పరిస్థితి ఉంది.

కానీ టీఆర్ఎస్ పార్టీ దళిత బంధు పధకాన్ని ప్రవేశపెట్టడంతో ఇప్పటికే మెజారిటీ లబ్ధిదారులకు దళిత బంధు పధకం లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది.దీంతో ప్రస్తుతం  మెజారిటీ దళితులు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉంది.

అందుకు బీజేపీ మందకృష్ణ మాదిగ మద్దతు కోరుతూ దోస్తీ చేస్తున్న పరిస్థితి.

Telugu Bandi Sanjay, Bjp Party, Bjp Strategies, Dalitha Bandhu Scheme, Huzurabad Dalit Votes, Kcr, Kishan Reddy, Mandakrishna Madiga, Raghunandan Rao, Telangana Politics, Trs Party-Political

అందుకు ప్రధాన కారణం దళితుల ఓట్లలో కొన్ని బీజేపీకి మళ్ళాలనే ఉద్దేశ్యంతో ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బండి సంజయ్, రఘునందన్ రావు ఇలా బీజేపీ రాష్ట్ర కీలక నేతలు మందకృష్ణ మాదిగతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి ఉంది.ఇప్పటి వరకు  బహిరంగంగా మందకృష్ణ మాదిగ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా అంతర్గతంగా బీజేపీకి మద్దతిచ్చి ఉండవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఏది ఏమైనా బీజేపీకి మందకృష్ణ మాదిగ మద్దతు వచ్చి ఉంటే టీఆర్ఎస్ అంచనాలు తారుమరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

#DalithaBandhu #HuzurabadDalit #Bjp #Bjp #Kishan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube