తెలంగాణ బీజేపీ రోజురోజుకు పెద్ద ఎత్తున బలపడటానికి ప్రయత్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.అయితే టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకెళ్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుండే ఇటు పార్టీ ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న బీజేపీ ఇక తాజాగా మరింతగా సోషల్ మీడియాపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారి పట్ల పోలీసులు కేసులు కూడా నమోదు చేయడంతో ఇక బీజేపీ కార్యకర్తలు కొద్దిగా సంయమనం పాటించడం మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం.
అయితే ఇక మరల మరింత జోష్ తో బీజేపీ పలు రకాల పోస్ట్ లతో టీఆర్ఎస్ పార్టీ పట్ల విరుచుక పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియానే పెద్ద ఎత్తున రాజకీయాలను ప్రభావితం చేసేంతగా ఎదిగిన పరిస్థితుల్లో ప్రతి ఒక్క పార్టీ సోషల్ మీడియాను తమ ప్రత్యర్థి పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సోషల్ మీడియా అస్త్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇతర పార్టీలతో పోలిస్తే సోషల్ మీడియా పరంగా బీజేపీ కొంత బలంగా ఉన్న విషయం తెలిసిందే.అయితే టీఆర్ఎస్ తో పోలిస్తే బీజేపీ రాజకీయంగా బలహీనంగా ఉన్నా సోషల్ మీడియా పరంగా బీజేపీ కంటే టీఆర్ఎస్ పార్టీ కాస్త బలహీనంగా ఉంది.అందుకే టీఆర్ఎస్ ను సగం దెబ్బ తీయాలంటే సోషల్ మీడియానే అని బలంగా భావిస్తున్న బీజేపీ ఆ దిశగా ఇప్పటికే పలు సమావేశాలను కూడా నిర్వహించిన నేపథ్యంలో వచ్చే రోజుల్లో మరింత వ్యూహాత్మకంగా బీజేపీ కదిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.