జనసేనే బీజేపీ టార్గెట్ మొదలెట్టేశారుగా..  

Bjp Focus On Janasena Party-

ఏపీలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కి , ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటి సారిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన కి ఎన్నికల అనంతరం ఫ్యూజులు మాడిపోయాయి.కింగ్ మేకర్ అవుతాడనుకున్న పవన్ కళ్యాణ్ తన సీటుకే ఎసరు రావడంతో దిక్కు తోచని పరిస్థితులో ఉండిపోయాడు.జనసేన నుంచీ ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీ కి వెళ్ళగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చెయ్యాలో అనే వ్యుహరచనల్లో మునిగి తేలుతున్నాడు...

Bjp Focus On Janasena Party--Bjp Focus On Janasena Party-

ఈ క్రమంలోనే బీజేపీ ఏపీలో వేగంగా పావులు కదుపుతోంది.

Bjp Focus On Janasena Party--Bjp Focus On Janasena Party-

ఇప్పటికే టీడీపీ లోని కీలక నేతలకి కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి బాబు కి కోలుకోలేని షాక్ ఇచ్చారు కాషాయ నేతలు.త్వరలో మరిన్ని షాకులు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నామని సూచనలు కూడా చేస్తున్నారు.అయితే చడీ చప్పుడు లేకుండా చాపకింద నీరులా ఏపీలో జనసేన పార్టీకే ఎర్త్ సిద్దం చేశారు.

వచ్చే ఎన్నికల్లోగా టీడీపీని ఎలాగోలా కూలగొట్టి వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని అనుకుంటున్న బీజేపీ జనసేన పార్టీపై కూడా కాన్సంట్రేషన్ పెట్టిందట.ఈ క్రమంలోనే .

ఎవరూ ఊహించని విధంగా ఏపీలో జనసేన సభ్యత్వాలని తమవైపుకి మార్చుకుంటోంది.ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే ఈ ప్రయత్నాలు మొదలు పెట్టింది.పవన్ సొంత జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ ఇప్పటికే గ్రామ గ్రామాలలో జనసైనికులతో బీజేపీ సభ్యత్వ నమోదు చేయించింది.

ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే.బీజేపీ లోకి చేరడానికి జనసైనికులు రెట్టింపు ఉశ్చాహంతో ముందుకు వస్తున్నారట.ఇప్పటికే పశ్చిమలో మెట్ట ప్రాంతంలో ఈ సభ్యత్వ నమోదు పూర్తి చేసుకున్న బీజేపీ నేతలు...

డెల్టాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలుస్తోంది.చూస్తుంటే వచ్చే ఎన్నికల్లోగా పవన్ కళ్యాణ్ పార్టీని కబ్జా చేసి తమపార్టీలో వీలీనం చేసేవిధంగా బీజేపీ పావులు కదుపుతోంది అంటున్నారు రాజకీయ పండితులు.మరి ఏపీలో బీజేపీ సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ అవుతాడేమో వేచి చూడాలి.