తెలంగాణ బీజేపీ రోజు రోజుకు బాలపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ తరువాత ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ మారాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కైవసమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికే అన్నీ నియోజకవర్గాలలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన బీజేపీ త్వరలోనే వారందరూ సోషల్ మీడియా వారియర్స్ గా మారి టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది.
ఎందుకంటే చాలా వరకు స్థానాల్లో బీజేపీకి కనీసమైన ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెంచడం ద్వారా బీజేపీ వైపు గాలి వీస్తే అభ్యర్థితో సంబంధం లేకుండా గెలిచే అవకాశం ఉందనే వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.
అంతేకాక ఇతర పార్టీలలో ఉన్న బలమైన నేతలను బీజేపీలోకి ఆహ్వానించి ఎన్నికల కంటే ముందుగానే కొన్ని ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు సాధిస్తామనే నమ్మకాన్ని ఏర్పరుచుకుని ముందుకు వెళ్ళడం ద్వారా కార్యకర్తలకు మరింత ఉత్తేజం కలుగుతుందనే వ్యూహాన్ని బీజేపీ కలిగి ఉంది.

అయితే బీజేపీలో చేరే ఆ బలమైన నేతలు ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాకున్నా ఎన్నికల హడావిడి మొదలయ్యాక ఎన్నికల వాతావరణం మొదలయ్యాక ప్రతి ఒక్క పార్టీ కార్యాచరణ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.బీజేపీ మాత్రం చాలా నమ్మకంగా ముందుకెళ్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీకి బలమైన కౌంటర్ ఇవ్వగలరా అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.ఎందుకంటే సోషల్ మీడియా పరంగా బీజేపీతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీ కాస్త బలహీనంగా ఉన్న మాట వాస్తవం.
అయితే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కూడా సోషల్ మీడియా బలోపేతంపై దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది.