ఏపీపై బీజేపీ ఫోక‌స్ ? ఆ ఓట్ల‌పైనే గురి ?

ఏపీ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేండ్ల స‌మ‌యం ఉంది.ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ ప‌రిణామాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

 Bjp Focus On Ap Aim At Those Votes , Bjp, Ap Politics-TeluguStop.com

నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంటిముట్టు ఉన్న బీజేపీ సైతం దృష్టిసారిస్తోంది.ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పుడుతున్నా కొద్ది పావులు క‌దుపుతున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో కాపులే కీల‌కంగా మారుతున్నారు.కాపు సామాజిక వ‌ర్గాన్ని మ‌చ్చ‌క చేసుకునేందుకు తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.కానీ, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కాపు సామాజిక వ‌ర్గం ముద్ర ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడు.

అందుకే కాపు వ‌ర్గంపై గ‌ళ‌మెత్తేందుకు వెనుకంజ వేస్తున్న ప‌రిస్థితి.ఇదే అంశాన్ని బీజేపీ క్యాచ్ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలిసింది.

గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో కాపుల‌కు 5శాతం కేటాయించింది.దీనిని మార్చి 15వ‌ర‌కు అమ‌లుచేయాల‌ని సూచించింది.కానీ, అధికారంలోకొచ్చిన వైసీపీ దానిని అమ‌లు చేయ‌లేదు.టీడీపీ సైతం నోరు మెద‌ప‌ని ప‌రిస్థితి.

కాపుల‌కు 5శాతం రిజర్వేష‌న్ల ప్ర‌స్థావ‌నకు పోతే బీసీ ఓటు బ్యాంక్ దెబ్బ‌తింటుంద‌ని భావించి గ‌ళం విప్ప‌ట్లేదు.వైసీపీది ఇదే ప‌రిస్థితి.

దీంతో బీజేపీ కాపు రిజ‌ర్వేష‌న్‌ల కోసం ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం.ఇందుకు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని రాజ్య‌స‌భ‌లో జీవీఎల్‌ నరసింహారావు ప్రస్తావించ‌డం బ‌లం చేకూరుస్తోంది.

అందుకే కాపుల‌కు విద్య‌, ఉద్యోగ రంగాల్లో 5శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించాల‌నే డిమాండ్ తీసుకొస్తుంద‌ని తెలిసింది.

ఏపీలో 28శాతం ఉన్న కాపు సామాజిక వ‌ర్గం ఓట్లు టీడీపీకి వెళ్ల‌కుండా బీజేపీ అడ్డుక‌ట్ట వేసేందుకే కాపు రిజ‌ర్వేష‌న్‌ను ప‌ట్టుబ‌డుతోంద‌ని టాక్‌.

కాపు సామాజిక వ‌ర్గం మొత్తం ఒక్క‌టైతే రాజ్యాధికారం చేజిక్కిచ్చుకోవ‌డం సుల‌వ‌వుతుంద‌ని బీజేపి ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలిసింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపు ఓటు బ్యాంక్‌ను చేజిక్కించుకునే పనిలో బీజేపీ ప‌డింది.

ఫైన‌ల్‌గా బీజేపీ ఫోక‌స్ మొత్తం కాపు సామాజిక‌వ‌ర్గంపైనే పెట్టిన‌ట్టు క‌న‌బ‌డుతోంది.

BJP Focus On AP Aim At Those Votes , BJP, Ap Politics - Telugu Ap

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube