'అమరావతి ' పై  బీజేపీ ఫోకస్ ! ఉద్యమానికి ఊపొచ్చేలా  ? 

అమరావతి ఉద్యమం పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీనే.ఆ పార్టీ ఆధ్వర్యంలోనే మహాపాదయాత్ర తో పాటు,  అమరావతి ఆందోళనలు, ఉద్యమాలు చోటుచేసుకుంటున్నాయి అనేది బహిరంగ రహస్యం పైకి రైతుల , మహిళలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమం చేపడుతున్నారనే సంకేతాలు ఇస్తున్నా, వెనుక ఉన్నది మాత్రం టిడిపినే అనేది అందరికీ తెలిసిందే.

 Bjp Focus On Amaravati Moment, Amravati, Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap, Ama-TeluguStop.com

ప్రస్తుతం ‘న్యాయస్థానం టూ దేవస్థానం ‘ పేరుతో అమరావతి ప్రాంత రైతులు మహిళలు పాదయాత్ర చేపట్టారు.ఈ ఉద్యమానికి మరింత ఊపు తీసుకువచ్చే విధంగా భారీ ఎత్తున జన సందోహం ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు.

  ఇప్పటికే అనేక జిల్లాల్లో ఈ యాత్ర ముగిసింది.  ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మహా పాదయాత్ర కొనసాగుతోంది.

ఇక అమరావతి వ్యవహారానికి  మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్న బిజెపి జగన్ తీసుకున్న మూడు రాజధానుల కు పరోక్షంగా మద్దతు పలికింది.

ప్రస్తుతం ఏపీ లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమరావతి ఉద్యమంలో బీజేపీ నేతలు తప్పనిసరిగా పాల్గొనాలి అంటూ కేంద్ర హోం మంత్రి , బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా సూచించడంతో,  ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు అమరావతి ఉద్యమంలో కీలకంగా మారారు.

ఎట్టి పరిస్థితుల్లోను అమరావతినే ఏపీ రాజధానిగా ఉండాలంటూ బిజెపి నేతలు సైతం డిమాండ్ చేస్తుండడంతో,  ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులు మహిళల్లో ఆనందం కనిపిస్తుంది .బిజెపి తలుచుకుంటే జగన్ ను ఏదో రకంగా  ఒప్పించో,  ,బయపెట్టో  తాము అనుకున్నది సాధిస్తుందని అమరావతి ప్రాంత రైతులు, మహిళలు అభిప్రాయపడుతున్నారు.
 

Telugu Amaravati, Amravati, Ap, Chandrababu, Jagan, Ysrcp-Telugu Political News

అంతేకాదు ఈ పాదయాత్ర తిరుపతిలో ముగిసే సమయం నాటికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈ పాదయాత్రలో పాల్గొని, సంఘీభావం ప్రకటించబోతున్నారు అనే వార్తలు ఈ ఉద్యమంలో పాల్గొన్న వారికి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి.ఇప్పటి వరకు అమరావతి ఉద్యమం అంటే టిడిపి అన్నట్లుగా పరిస్థితి ఉంది.అయితే ఇకపై బిజెపిదే ఈ ఉద్యమంలో యాక్టిివ్ రోల్ అని అందరికీ అర్థం అయ్యేలా చేసి టిడిపికి క్రెడిట్ దక్కకుండా చేసేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube