ఈటల నచ్చకే రాజీనామాలట.. హుజూరాబాద్‌లో బీజేపీకి దెబ్బ‌!

తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమ కాలం నుంచి వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ తాజాగా అధికార టీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సమయంలో ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

 Bjp Faces Blow In Huzurabad Due To  Eatala Rajendar, Bjp, Bjp Mandal Leaders, Re-TeluguStop.com

ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి కోలుకోలేని షాక్ తగిలింది.

నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో బీజేపీ మండల నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.మండల ప్రధాన కార్యదర్శి జితేందర్ గౌడ్, యువమోర్చా అధ్యక్షుడు గుత్తికొండ పవన్ కుమార్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రత్నాకర్ తో పాటు మరో 200 మంది కూడా పార్టీకి రాజీనామా చేశారు.

వారు రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.తమకు ఈటల వర్గం ప్రాధాన్యతనివ్వడం లేదని జిల్లా నాయకులతో కూడా చెప్పినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Bjp, Eatala Rajender, Etela Effect, Jitender Goud, Ratnakar, Shock Bjp, T

కాగా.బీజేపీ నేతల రాజీనామాలతో హుజురాబాద్ కాషాయ నేతల్లో కలవరం మొదలైందని పలువురు చర్చించుకుంటున్నారు.ఇంకా కనీసం ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా రిలీజవక ముందే ఇలా నాయకులు పార్టీని వీడటం మంచిది కాదని అంటున్నారు.దీని ప్రభావం ఉప ఎన్నికల్లో పార్టీపై, పార్టీ అభ్యర్థిపై పడుతుందని పేర్కొంటున్నారు.

ఇలా పార్టీలో విబేధాలు వస్తే.జనాలకు పార్టీపై పార్టీ అభ్యర్థిపై అభిప్రాయం మారుతుందని, తద్వారా ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇటు అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా యోచిస్తూ.ప్రణాళికలు రచిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube