కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కసరత్తు

కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ( BJP ) తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఎన్డీఏ పక్షాలకు ఎన్ని పదవులు ఇస్తారనే దానిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఈ క్రమంలో మంత్రివర్గ కూర్పుపై బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్( JP Nadda, Amit Shah, Rajnath Singh ) ప్రత్యేక దృష్టి సారించారు.అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఆరుగురికి స్థానం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ నుంచి ముగ్గురు లేదా నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరికి కేబినెట్ లో ఛాన్స్ ఉంది.కాగా ఏపీలో టీడీపీ మూడు, బీజేపీకి ఒకటి మరియు జనసేనకు ఒక మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

అయితే తెలంగాణ నుంచి రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉండగా.ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, ప్రసాదరావు, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, బైరెడ్డి శబరి, లావు శ్రీకృష్ణదేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు