తిరుప‌తిపై బీజేపీ ప‌క్కా వ్యూహం.. ఇదే!  

BJP plan on Tirupati,elections,BJP,janasena,andhra politics,pawan kalyan,candidate,TDP,chandra babu naidu - Telugu Andhra Politics, Bjp, Chandra Babu Naidu, Elections, Janasena, Pawan Kalyan, Select, Tdp, This Is The Bjp Exact Plan On Tirupati

తొంద‌ర‌ప‌డి ఒక కోయిల ముందే కూసింది! అన్న‌ట్టుగా ఉంది బీజేపీ ప‌రిస్థితి.తిరుపతి లోక్‌సభ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.

TeluguStop.com - Bjp Exact Plan On Tirupati

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మికంగా మ‌ర‌ణించారు.దీంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.

అయితే, నోటిఫికేష‌న్‌కు ఇంకా చాలా స‌మ‌యం ఉంది.అయితే, ఇప్ప‌టి నుంచే స‌ద‌రు ఉప ఎన్నికకు  పార్టీలు అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నాయ‌ని.

TeluguStop.com - తిరుప‌తిపై బీజేపీ ప‌క్కా వ్యూహం.. ఇదే-Political-Telugu Tollywood Photo Image

సో.మేం మాత్రం త‌క్కువ తిన్నామా? అని బీజేపీ నేత‌లు భావిస్తున్నార‌ట‌.
ఈ క్ర‌మంలోనే జనసేన-బీజేపీ మిత్ర‌ప‌క్షం కూడా అభ్యర్థిని ఖరారు చేసే పనిలో ప‌డింది.ఇంకో వైపు టీడీపీ కూడా అభ్యర్థిని నిలబెట్టి తీరుతామని.ఖ‌చ్చితంగా పసుపు జెండా ఎగరేస్తామని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.ఈ నేప‌థ్యంలో బీజేపీ కూట‌మి మ‌రింత ముందుగానే ఈ విష‌యంలో కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సీటుపై ఏకంగా బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ సునీల్ దేవ్‌ధ‌ర్ దృష్టి పెట్టార‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు.అయితే, ఆయ‌న మీడియాకు ఉప్పంద‌కుండా ఈవిష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ నేత‌లు చెబుతున్న స‌మాచారం బ‌ట్టి.తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు.

జనసేన, బీజేపీల్లో ఎవరికి సీటు కేటాయించినా సమిష్టిగా పనిచేయాలని కూడా నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.అయితే, బీజేపీని మాత్రం బ‌లోపేతం చేసుకునేలా వ్యూహం సిద్ధం చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అంటే.ఉప ఎన్నికల్లోపు బీజేపీలోకి చేరికలను పెంచాలని.

వైసీపీలో అసమ్మతి నేత‌లుగా ఉన్న‌వారితోపాటు.టీడీపీ నుంచి వ‌స్తామ‌నే వారికి కూడా రెడ్ కార్పెట్ ప‌ర‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తిరుప‌తి బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

అంతేకాదు.ఉప ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని, బీజేపీ స‌త్తా చాటాల‌ని కూడా నిర్ణ‌యించుకున్న‌ట్టు ప్ర‌చారం ఊపందుకుంది.

మొత్తానికి బీజేపీ మంచి క‌సిమీదే ఉన్నా.ప్ర‌జ‌లు ఉండాలిగా! అంటున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

#ThisIs #Andhra Politics #Pawan Kalyan #Elections #Select

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bjp Exact Plan On Tirupati Related Telugu News,Photos/Pics,Images..