ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్న బీజేపీ! బగ్గుమన్న కాశ్మీరీలు

లోక్ సభ ఎన్నికలలో భాగంగా అధికార పార్టీ బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోని ఈ రోజు విడుదల చేసింది.ఇక ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిన బీజేపీ పార్టీ అధిష్టానం కొన్ని కీలక అంశాలని కూడా తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది వీటిలో ముఖ్యంగా ఆర్టికల్ 370, 35ఎ.

 Bjp Election Manifesto Controversial In Kashmir Issue-TeluguStop.com

తాము మళ్ళీ అధికారంలోకి వస్తే దశాబ్దాలుగా భారతీయులందరికీ తలనొప్పిగా ఉన్న కాశ్మీర్ ప్రజలకి ప్రత్యేక హక్కులు కల్పిస్తూ ఉన్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.

ఆర్టికల్ 370, 35ఎ రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడంపై దేశ వ్యాప్తంగా కొంత సానుకూలత వ్యక్తం అవుతూ ఉంటే కాశ్మీర్ ప్రజలలో మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

ఆర్టికల్ 35ఎ అక్కడ ఉండే బయటి ప్రాంతాల ప్రజల హక్కులకి ఆటంకం కలిగించే విధంగా ఉంది.కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించడం వలన ఉగ్రవాదుల చొరబాట్లు ఎక్కువ అయిపోతునన్నాయని బీజేపీ నాయకులు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దు చేస్తే ఇక కాశ్మీర్ ప్రజలు భారతదేశం నుంచి వేరుపడటమే మిగిలి ఉంటుందని కాశ్మీర్ రాష్ట్రంలో రాజకీయ నేతలు తీవ్ర వాఖ్యలు చేస్తున్నారు.కాశ్మీర్ ప్రజల హక్కులకి భంగం కలిగించే విధంగా బీజేపీ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వాటికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాయి.ఇక కాశ్మీర్ ప్రజలు కూడా కూడా బీజేపీ మేనిఫెస్టో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసన తెలియజేయడానికి రెడీ అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube