కంచుకోట లలో కూడా పట్టు కోల్పోతున్న బీజేపీ..!!

వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో దేశంలో తిరుగులేని పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి తెలిసిందే.అయితే కరోనా దేశంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత.

 Bjp Down Fall Started All Over India-TeluguStop.com

మొదటిసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పెట్టి కరోనా ని అరికట్టిన రీతిలో మోడీ క్రెడిట్ పొందినట్లు మీడియా చిత్రీకరించింది.ఇదే క్రమంలో ప్రపంచంలో చాలా దేశాల కు మోడీ అప్పట్లో ఆపన్నహస్తం గా నిలిచారు.

కానీ దేశంలో సెకండ్ వేవ్ వచ్చేసరికి కంట్రోల్ చేయలేని పరిస్థితి తో పాటు… భయంకరంగా శవాలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతూ ఉండటంతో మోడీ ప్రభుత్వాన్ని స్వదేశంలోనే మాత్రమేకాక అంతర్జాతీయ స్థాయిలో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

 Bjp Down Fall Started All Over India-కంచుకోట లలో కూడా పట్టు కోల్పోతున్న బీజేపీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ముమ్మాటికీ భారతీయుల కరోనా చావులకు బీజేపీ ప్రభుత్వ వైఫల్యమే అని అంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్ వస్తుందని చాలా దేశాలు అప్రమత్తం చేసినా గాని మోడీ.కుంభమేళ నిర్వహించడంతోపాటు.ఎన్నికలకు వెళ్లడంతో.దేశంలో వైరస్ భయంకరంగా విజృంభించింది అని ప్రముఖులు మరియు విపక్షాలు మండిపడుతున్నాయి.దేశంలో జనాలు కూడా బీజేపీ తీరుపై విమర్శలు చేస్తున్నారు.ఇటువంటి పరిస్థితిలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాజాగా బిజెపికి గట్టిగా జనాలు షాకిచ్చారు.

Telugu Amit Shah, Ayodhya, Bjp, Bjp Downfall, Bjp Government, Corona Second Wave, Election Campaigning, Kumbha Mela, Madhura, Modi, Narendra Modi, Panchayat Elections, Varanasi-Political

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సొంత కంచుకోటలో కూడా బిజెపి పట్టు కోల్పోయిన పరిస్థితి.విషయంలోకి వెళితే వారణాసి, అయోధ్య, మధుర ఆధ్యాత్మిక క్షేత్రాలుగా పేరొందిన ఈ స్థానాలు.ఎప్పటి నుండో బీజేపీకి కంచుకోటలు.అటువంటి ఈ మూడు చోట్ల ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో.జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ పెద్దగా స్థానాలు గెలవలేదు.ఊహించని విధంగా వేరే పార్టీలు ఇక్కడ ఇప్పుడు సత్తా చాటుతూ ఉండటంతో.

సొంత అడ్డా లో కూడా బీజేపీ పార్టీపై జనాలకు నమ్మకం పోయింది అని తాజా ఫలితాలపై రాజకీయాలు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

#Varanasi #Modi #Bjp Downfall #BJP Government #Kumbha Mela

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు